NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan : విద్యార్థి పాఠశాలకు గైర్హజరైతే వాలంటీర్ వారి ఇంటికి వెళ్లి ఆరా తీయాలి

YS Jagan : ప్రభుత్వ పాఠశాల schools ల్లో విద్యార్థి student  ఎవరైనా తరగతులకు హజరు కాకపోతే యాప్ ద్వారా గైర్జాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలనీ, రెండవ రోజు నేరుగా వారి ఇంటికి వాలంటీర్ ను పంపి వివరాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన బడి “నాడు – నేడు” కార్యక్రమంపై బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  విద్యార్థుల హజరు పై యాప్ ను రూపొందించారా? లేదా? అని అధికారులను జగన్ ప్రశ్నించారు. దీనిపై అధికారులు సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 15 వ తేదీ నుండి విద్యార్థుల హజరుపై యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని తెలిపారు. పిల్లలు పాఠశాలకు రాకపోతే మరుసటి రోజే వాలంటీర్ వాళ్ల ఇంటికి వెళ్లి వాకబు చేయాలని సీఎం ఆేదేశించారు.

YS Jagan : ap cm ys jagan review on nadu -nedu second phase schools
YS Jagan : ap cm ys jagan review on nadu -nedu second phase schools

నాడు నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని ఆధికారులను జగన్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. రెండవ విడత పనులు ఏప్రిల్ 15వ తేదీ నుండి ప్రారంభిస్తామని, డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి అయ్యేలా ప్రణాళిక వేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. రెండవ విడత కోసం అంచనా వ్యయం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చుగా అధికారులు తెలిపారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

పాఠశాలల అభివృద్ధికి ఒక్క సంవత్సరంలో ఇంత మేర నిధులు వెచ్చించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు వివరించారు. అదే విధంగా గోరు ముద్ద మధ్యాహ్న భోజన పథకంపైనా సీఎం జగన్ సమీక్ష జరిపారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై కూడా సమీక్ష జరిపారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం దాదాపు 49వేల మంది సిబ్బంది అవసరమని, ఎన్ ఓ పి టాయిలెట్ల నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ శిక్షణ ఇస్తుందని వివరించారు.

 

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju