NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : జ‌గ‌న్ దూకుడు కు జై కొట్టిన మోడీ

CM Jagan Delhi Tour: Another Fight on HighCourt?

YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఓ తీపి క‌బురు. ఏపీ సీఎం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యం విష‌యంలో కేంద్రం నుంచి ఎలాంటి సిగ్న‌ల్స్ వ‌స్తాయో అనుకున్న వారికి షాకిచ్చేలా … ఏపీ స‌ర్కారు నిర్ణ‌యానికే జై కొట్టింది.

ys-jagan-received-support-from-modi
ys-jagan-received-support-from-modi

ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని, ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోబోమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్ప‌టికే ప‌రిపాల‌న రాజధాని విశాఖ‌ప‌ట్ట‌ణానికి త‌ర‌లించే ప‌నిలో బిజీగా ఉన్న ఏపీ స‌ర్కారుకు ఇది పెద్ద గుడ్ న్యూస్ .

YS Jagan  జ‌గ‌న్ కు ఇది గుడ్ న్యూస్‌

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నల‌కు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. `ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదనలు పంపించిందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే, ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? కర్నూలుకు హైకోర్టును తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన ప్రస్తుత పరిస్థితి; దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవడానికి నిర్దేశించిన నిర్ణీత సమయం; ఒకవేళ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే, కర్నూలును లీగల్ కేపిటల్‌గా ఈ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుందా? తెలియజేయాలి` అని జీవీఎల్ కోరారు. దీనికి కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.

క్లారిటీ వ‌చ్చేసిందిగా…

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారని తెలిపారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీట్‌ తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టును సంప్రదించి తీసుకుంటుందని రాష్ట్ర హైకోర్టు నిర్వహణ ఖర్చులను భరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తేల్చిచెప్పారు. త‌ద్వారా కేంద్రం ప‌రిమిత పాత్ర పోషిస్తుంద‌ని ,ఇంకా చెప్పాలంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉండ‌గా ఇటీవ‌లే రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖలో సీఎ క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయం బ్లూ ప్రింట్, డిజైన్లు సిద్దం అయ్యాయని తెలుస్తోంది. లే ఔట్ ప్లానుకు ఉడా ఆమోదం తెలిపిందని స‌మాచారం. విశాఖ‌లో రూ. 113 కోట్లతో సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి ఉడా ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు స‌మాచారం. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి తాజాగా కేంద్రం ఇచ్చిన క్లారిటీ తోడ‌యింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju