Vantalakka: అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా తెలుగు సినీ పరిశ్రమలో హీరో గా అడుగుపెట్టి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరో గా తెలుగు తెర కు పరిచయం అయ్యారు అక్కినేని సుమంత్. తన సినీ కెరీర్ లో మధ్య మధ్య లో కొన్ని ఫ్లాపులను కూడా చవిచూసారు సుమంత్. ఇక దీనితో హీరోగా అనుకున్న రేంజ్లో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యారు. ఈ రోజు అక్కినేని సుమంత్ 46వ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ నేపధ్యంలో కార్తీకదీపం వంటలక్క దీప కూడా ఆయనను విష్ చేశారు. ఆమె నటనతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రేమి విశ్వనాథ్.
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఏ హీరో గురించి మాట్లాడని ప్రేమి మొదటి సారి సుమంత్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆంతేకాకుండా తెలుగు లో సుమంత్ తన అభిమాన హరో అని ఆమె పేర్కొన్నారు. సుమంత్ రానున్న రోజుల్లో ప్రేక్షకుల మన్నన పొంది ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఆమె సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేశారు.
సుమంత్ అక్కినేని కన్నడ సూపర్ హిట్ చిత్రం కవులుదారి తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం మనకు విధితమే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ గా ఉన్నది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.