NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

KCR : ఈ లెక్కలేసుకునే కేసిఆర్ ఆమెకి మేయర్ పదవి ఇచ్చాడు…?

KCR :  జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ను నియమించడానికి కెసిఆర్ చాలా సమయమే తీసుకున్నారు. ఎంతో వ్యూహాత్మకంగా మేయర్, ఉప మేయర్ పదవులను నియమించడానికి జాప్యం చేసిన కేసీఆర్ చివరికి ఒక బీసీ మహిళకు ఈ పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

KCR equations for new GHMC mayor
KCR equations for new GHMC mayor

ముందు వారికే అనుకున్నారు…!

జనరల్ కేటగిరీలో మహిళలకు ఈసారి జిహెచ్ఎంసి మేయర్ అయ్యే అవకాశాలు ఉండటంతో ఎంతోమంది కార్పొరేటర్లు ఈసారి పదవి తమకు వస్తుందని ఆశించారు. కొంతమంది కేటీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వారైతే మరికొందరు కేసీఆర్ దృష్టిలో పడ్డారు. అయితే ముందుగా రెడ్డి సామాజిక వర్గానికి పదవిని కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ కేసీఆర్ మాత్రం అన్నీ సమీకరణాలను పరిశీలించి చివరికి బీసీలకే పదవి కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే టిఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మిని మేయర్ పీఠం వరించింది.

ఆ రెండు దృష్టిలో పెట్టుకునే….

ఇక ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దుబ్బాక ఎన్నికల్లో పరాజయం అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడమే కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కారణాలని అంతేకాకుండా ఇప్పటి వరకు బిసి సామాజిక వర్గానికి న్యాయం చేయలేదని డిమాండ్ల నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిసి సామాజిక ఓటు బ్యాంకు కూడా కేసీఆర్ దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

KCR వారినీ బుజ్జగించారు….

ఇకపోతే మంగళవారం టిఆర్ఎస్ సీనియర్ నేత కేకే ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో కేసీఆర్ తనకు ఇచ్చిన హామీ కూడా గుర్తు చేసిన ఆయన తన కూతురికి మేయర్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక అయాన కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఇవ్వడం వల్ల ఆ సామాజిక వర్గాన్ని కూడా బుజ్జగించినట్లు అవుతుందని కేసీఆర్ మెదడులో ఉన్నట్లు తెలుస్తోంది. 

మొత్తానికి కేసీఆర్ ఈ లెక్కలు బాగానే వేసుకున్నాడు కానీ బిజెపి రాష్ట్రంలో విపరీతంగా పుంజుకుంటోంది…. ఇక షర్మిల కొత్త పార్టీ వల్ల ఓట్లు భారీగా చీలుతాయి. మరి సీఎం గా ఇంకో పదేళ్ళు తానే ఉంటానని చెప్పిన కేసీఆర్ మధ్యలో వచ్చే ఎన్నికలు కూడా గెలవాలి అని గుర్తుంచుకుంటే మంచిది అంటున్నారు రాజకీయ పండితులు.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju