NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

TTD : టీటీడీ మీద కేంద్రం కన్ను! బాంబు పేల్చిన మాజీ కేంద్రమంత్రి!!

TTD : ఇప్పటికే రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మీద ఆందోళన రోజురోజుకు ఉదృతం అవుతుంటే.. మరోపక్క కేంద్ర పెద్దలు మాత్రం రాష్ట్రంలో కీలకమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల TTD టీటీడీ కేంద్రం పరిధిలోకి తీసుకు వెళ్లడానికి వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాలకమండలి ద్వారా తిరుమల క్షేత్రం నిర్వహణ సాగుతోంది. దీన్ని తొలగించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తిరుమలలో తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తిరుపతి మాజీ ఎంపీ మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ దీనిమీద చెప్పిన కొన్ని విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. తిరుమల క్షేత్రం కూడా త్వరలోనే కేంద్రం చేతుల్లోకి వెళ్లబోతోంది అని, దానికి సంబంధించిన అన్ని ప్రణాళికలో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లు సిద్ధం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

హిందూ ధర్మ ఆచార్య సభ ఆధ్వర్యంలో..

కేంద్రం పూర్తిగా టిటిడి ను తన చెప్పుచేతల్లో తీసుకోకుండా ఒక మధ్యవర్తిత్వం ద్వారా… టిటిడి ను పూర్తిగా అప్పగించాలని భావిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నడిచే హిందూ ధార్మిక ఆచార్య సభ కు టి.టి.డి నిర్వహణను అప్పగించాలని, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విమర్శలు రాకుండా కేంద్రం తెలివిగా వ్యవహరించాబోతోందఅని తెలుస్తోంది. హిందూ ధర్మ ఆచార్యుల సభ పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇది ఒక రకంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంగం గానే పిలుస్తారు. ఒకవేళ తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని హిందూ ధర్మ ఆచార్యుల సభకు అప్పగిస్తే అది పూర్తిగా ఆర్ఎస్ఎస్ చేతిలోనే ఉన్నట్లు అని, రాష్ట్ర ఆజమాయిషీ అసలు ఉండకుండా ఉండేలా ప్రత్యేకమైన నిబంధనలు చట్టాలు మార్పులు చేసారని తెలుస్తోంది.

ఇప్పటికే కీలక సమావేశం

తిరుమల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇటీవల ఢిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం పూర్తిగా తిరుమల శ్రీవారి క్షేత్రం కేంద్రం ఎలా తమ ఆధీనంలోకి తీసుకోవాలి అనే అంశం మీదే జరిగినట్లు సమాచారం. ఇట్లు ఆర్ఎస్ఎస్ పెద్దలు 30 మందితో పాటు బిజెపి కీలక నాయకులు సైతం ఈ సమావేశంలో పాల్గొని తిరుమల ను ఎలా తమ ఆధీనంలోకి తీసుకోవాలని విషయాన్ని చర్చించినట్లు సమాచారం. దీనిని ఒకేసారి కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే రాష్ట్రం నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ఈ సమావేశంలో చర్చించారు. దానికి సంబంధించి మరి ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ ద్వారా మొదట హిందూ ధర్మ ఆచార్యుల సభలోని కొందరిని తిరుమల వ్యవహారాల్లో కీలకంగా ఉంచి తర్వాత, మెల్ల మెల్లగా తిరుమల క్షేత్రాన్ని ఆ దినం చేసుకోవాలి అన్నది కేంద్రం ప్లాన్. గతంలోనే కేంద్రం పురావస్తు శాఖకు సంబంధించి కీలకమైన ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా తిరుమల క్షేత్రానికి కేంద్రం త్వరలోనే తీసుకోబోతోంది అన్న మాటలు వచ్చిన… రాష్ట్రం నుంచి ఇటు ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో అప్పట్లో ఈ ప్రతిపాదనను కేంద్రం విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ తాజాగా కేంద్రమంత్రి డిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చను అక్కడ జరిగిన కొన్ని సమావేశాల ఆధారంగా తిరుమల భవిష్యత్తులో కేంద్రం చేతుల్లో కి వెళ్లడం ఖాయం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?