NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TTD Chairman : రఘురామకృష్ణంరాజు అడిగిన దాంట్లో తప్పేముంది??

TTD Chairman : రఘురామకృష్ణంరాజు అడిగిన దాంట్లో తప్పేముంది??

TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ TTD Chairman ప్రజాప్రతినిధులకు స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో లెటర్లు ఆధారంగా ఒక్కో లెటర్ మీద గరిష్టంగా ఆరుగురికి వీఐపీ ప్రోటోకాల్ దర్శనం సైతం ఇస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ప్రోటోకాల్ దర్శనం పరిధిలోకి వస్తారు. అలాగే వీరితో పాటు సెలబ్రిటీలకు సైతం మంచి దర్శనం ఇస్తోంది. ఇదంతా ఓకే కానీ.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రోటోకాల్ దర్శన వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఆయన మీడియా కు ఎక్కి రక్త చేయడంతో టీటీడీ ప్రతిష్ట ఇష్యూగా ఇది మారుతోంది.

new contravecy for TTD
new contravecy for TTD

** టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ని ఇటీవల ఓ టీవీ చర్చ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇష్టానుసారం మాట్లాడారు. అనకూడని కొన్ని మాటలను సైతం అన్నారు. ఓ పార్టీ టికెట్ మీద గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ విప్ దిక్కరించి చకుండా, కేవలం పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారం విమర్శలకు దిగుతున్నారు. ఇటు ముఖ్యమంత్రి జగన్ ను ఆయన విడిచి పెట్టడం లేదు. అయినా చట్టపరంగా ఆయనను ఏమీ చేయలేక వైసిపి నాయకత్వం తలలు పట్టుకుంటుంది. ఈ రోజు ఢిల్లీలో రచ్చబండ అంటూ వైసీపీ నాయకుల మీద నానా మాటలు అంటూ రాష్ట్ర చేస్తున్నా రఘురామకృష్ణంరాజు మీద టీటీడీ కక్ష తీర్చుకోవడం ఇప్పుడు ప్రధానాంశం.

** వివాదాలు, కోపాలు, విమర్శలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా ప్రోటోకాల్ విషయంలో కి వచ్చేసరికి అవేమి పట్టవు. ఖచ్చితంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి ప్రోటోకాల్ పాటించాల్సిందే. అలా చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే. టీటీడీ ఈ విషయంలో ఇప్పుడు ఇదే చేస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘన వరకు వెళ్లాల్సిన అవసరం లేదు కానీ టిడిపి ప్రజా ప్రతినిధులు అందరికీ ప్రోటోకాల్ దర్శనం, పాస్ లేఖలను అనుమతిస్తూ కేవలం ఓ ఎంపీకి ఆ అవకాశం లేకుండా చేయడం వల్ల టీటీడీ ప్రతిష్ట మీద మచ్చ వస్తుంది. మరో దారిలో రఘురామకృష్ణంరాజు మీద పగ తీసుకోవాల్సిన వై వి సుబ్బారెడ్డి డైరెక్ట్ అటాక్ చేస్తూ ఆయనకు ఫోటో కాల్ దర్శనం ఇవ్వను అని చెప్పడం నైతికత కాదు. అందరికీ దర్శనం ఇస్తూ రఘురామకృష్ణంరాజు కి మాత్రం దర్శనం చేయడం వల్ల వైస్సార్సీపీ గెలిచింది అని అనుకోవడం కంటే రాజకీయ వివాదంలోకి టిటిడి ని సైతం లాగుతున్నారు అని మాత్రం చెప్పవచ్చు.

** టీటీడీ కచ్చితంగా అందరికీ దర్శనం ఇవ్వాలని ఎక్కడ నిబంధన లేదు. టీటీడీ నిబంధనల పుస్తకాల్లో సైతం ప్రజాప్రతినిధులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని ఆ అంశం ఎక్కడా పేర్కొనలేదు. అయితే గతంలో టిటిడి బోర్డు చేసిన తీర్మానం ఆధారంగానే ఎప్పటినుంచో ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ దర్శనం వారి సిఫార్సులకు వీఐపీ దర్శనం ఇచ్చే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పుడు కేవలం ఓ ఎంపీ మీద ఉన్న కోపం కొలది ఈ దర్శనం మీద కొత్త వివాదాన్ని టీటీడీ తీసుకువచ్చేలా కనిపిస్తోంది. తనకు సిఫార్సు లేఖలను అనుమతించకపోతే, మిగిలిన ప్రజాప్రతినిధులకు సైతం లేఖలను అనుమతించడం టిటిడి మానుకోవాలి అంటే ఇప్పుడు కొత్త వివాదం రఘురామకృష్ణంరాజు ఢిల్లీ వేదికగా తీసుకొస్తే అది మళ్లీ కేంద్రం పెద్దల జోక్యం లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు టీటీడీ వ్యవహారాల్లో తలదూర్చలా అని చూస్తున్న కొందరు కేంద్ర పెద్దలకు ఇది మంచి స్టఫ్ అవుతుంది.

** మరోపక్క రఘురామకృష్ణంరాజు తన ఆవేదన తో కూడిన స్వరంలో ప్రజా ప్రతినిధులు కానివారికి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ తరఫున కొనసాగుతున్న వారికి టీటీడీ ప్రత్యేక దర్శనాలు ఇస్తోందని చెప్పడం విశేషం. నిజంగానే ఇది తిరుమలలో సాగుతోంది. కొందరు అనధికారికంగా అధికార పార్టీలో పేరు చెప్పి బడా నాయకులుగా చలామణి అవుతూ తిరుమలలో దర్శనాలను దందా చేస్తున్నారు అనేది గతంలో చాలాసార్లు బయటపడింది. ఇది అన్ని ప్రభుత్వాలు హయాంలో తిరుమల లో జరుగుతున్న భక్తి దంద.

** ప్రతి నాయకుడు కొండ పైన ఒక ప్రత్యేక పి ఆర్ ఓ ని పెట్టుకొని తమ వారు ఉన్నా లేకున్నా, దర్శనలకు వెళ్తున్న వెళ్లకపోయినా ఆయా తేదీల్లో వచ్చే వారి కోట టికెట్లను అమ్ముకొని కూడా లాభం పొందిన వారు చాలా మంది కనిపిస్తారు. టీడీపీ హయాంలో చిన్నచిన్న నాయకులు సైతం తమ లెటర్ హెడ్ మీద సంతకం చేసేసి బల్క్ గా కొండపై ఉన్న పి ఆర్ వో లకు లెటర్లు ఇచ్చేవారు. ఆ పి ఆర్ వో లు అనబడే దళారులు వాటిని తిరుమల దర్శనానికి వచ్చేవారికి వేలల్లో అమ్మవారు. ప్రతి నెల ఇన్ని టికెట్లకు ఇంత మొత్తం అంటూ సదరు నాయకులకు డబ్బు ముట్టేది. ఈ దర్శనం దందా గురించి చెబితే అంతా ఇంతా కాదు. కాబట్టి దీనిని రాజకీయం చేసి టిటిడి ప్రతిష్టను మరోసారి ఢిల్లీ వరకు లాగకుండా వై వి సుబ్బారెడ్డి విజ్ఞతతో ప్రదర్శిస్తే అందరికీ మంచిది.

 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju