Thank you : థాంక్యూ…అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా. అక్కినేని ఫ్యామిలీతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న మనం ఫేం విక్రం కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హాకీ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నట్టు సమాచారం. రాజమండ్రిలో ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే దర్శకుడు విక్రం కె కుమార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసిన ప్రియాంక అరుళ్ మోహన్ ఒక హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. అలాగే మరొక హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నారట. పూజా హెగ్డే కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా నాగ చైతన్య భార్య సమంత ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. విక్రం కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమాలో నాగ చైతన్య – సమంత ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే.
Thank you : థాంక్యూ లో మరోసారి చైతు- సమంత ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని ట్రై చేస్తున్నారట.
అలాగే మజిలీ సినిమా కూడా చైతు- సమంత కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలు మరోసారి ఈ జంటని సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని ట్రై చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంత ఉన్నది తెలియదు గాని ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగ చైతన్య నటించిన లవ్ స్టోరి రిలీజ్ కి రెడీ అవుతుండగా సమంత .. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అన్న బహుభాషా చిత్రంలో నటించబోతోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రానుంది.