NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Vijayawada : విజయవాడ లో ఏం జరగబోతోంది?

What happened in Vijayawada

Vijayawada : అమరావతి ప్రధాన నగరమైన విజయవాడ కార్పొరేషన్ మీద కోటి ఆశలు పెట్టుకున్న టిడిపి కలలు కల్లలు అయ్యాయి. అధికార వైసిపి విజయవాడ కార్పొరేషన్లో తన జెండా పాతింది. మొత్తం 60 డివిజన్లు ఉన్నా విజయవాడ లో ఏకంగా 49 డివిజన్లను వైసిపి కైవసం చేసుకుంటే కేవలం 14 డివిజన్ లో మాత్రమే టిడిపి ఖాతాల్లో పడ్డాయి. ఒక డివిజన్ లో సిపిఎం విజయం సాధించింది. విజయవాడలో అద్భుతం జరుగుతుందని ఊహించిన టిడిపి శ్రేణులకు ఈ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

అమరావతి సెంటిమెంట్ కచ్చితంగా ఉంటుందని అది నగర ఓటర్లలో ఎక్కువగా కనిపిస్తోందని టీడీపీ అంచనా వేసింది. విజయవాడ ను రక్షించుకోవడం ద్వారా అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేసి, టిడిపి కు మళ్లీ జవసత్వాలు కల్పించాలని చంద్రబాబు భావించారు. అయితే టిడిపి అసలే వీ విజయవాడ ఎన్నికల్లో తీరలేదు. వైసిపి ఏకపక్షంగా విజయం సాధించిన విజయవాడలో ఇప్పుడు సరికొత్త పోటీ మేయర్ అభ్యర్థి విషయంలో రానుంది. ఈ నెల 18 వ తేదీన జరగబోయే మేయర్ ఎంపికలో విజయవాడ కార్పొరేషన్ మీద అందరి దృష్టి పడింది. దీనికి కారణం అధికార పార్టీలో మేయర్ పీఠం కోసం ఏకంగా 27 మంది పోటీలో ఉన్నారు.

what-is-exact-at-vijayawada
what-is-exact-at-vijayawada

ఎవరో ఏమవునో?

విజయవాడ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో కులాలకు అతీతంగా ఎవరైనా దానిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అధికార వైసీపీ లో గెలిచిన 49 మంది కార్పొరేటర్ల లో, 27 మంది కార్పొరేటర్లు మహిళలు కావడం విశేషం. వీరంతా కూడా తమ తమ మార్గాల్లో మేయర్ పదవిని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

** వైఎస్ఆర్సిపి నేతలను అగ్రనేతలను కలుసుకుంటూ తమకు అవకాశం కల్పించాలని వీరంతా కోరుతున్నారు. మెయిల్ పోటీలో ప్రధానంగా ఉంటారని భావించిన మధ్య నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి కూతురు లికిత రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలవడంతో అంతా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు అన్నట్లుగా ఇప్పటివరకు మేయర్ రేసులో లేనివారు సైతం కొత్తగా ప్రయత్నాలు చేయడం విశేషం.

** సీఎం హామీ ఇచ్చారని కొందరు ప్రచారం చేస్తుంటే సీఎంవో అధికారులతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలు తమకు లాభం చేకూరుతాయని మరి కొందరు అంచనా వేస్తున్నారు. ఇక నేతల పరంగా తమ నియోజక వర్గానికి మెయిల్ పెట్టండి దక్కాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు పార్టీ విధేయత గతంలో ఇచ్చిన హామీలు ఎలా ఎవరి ఫార్ములా వారు ప్రయోగిస్తున్నారు.

** 34 వ డివిజన్ నుంచి విజయం సాధించిన బండి పుణ్య జిల్లా మేయర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. గతంలో కార్పొరేషన్ వైసిపి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన ఆమెకు రాజకీయ చాణక్యం ఉంది. మొదటి నుంచి పార్టీని నడిపిస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి టిడిపి లో కొందరు కార్పొరేటర్లు చేరిన, పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపించానాని, అవకాశం ఇవ్వాలని ఆమె గట్టిగా కోరుతున్నారు.

** విజయవాడ మేయర్ పీఠాన్ని వెస్ట్ నియోజకవర్గానికి ఇవ్వాలని మంత్రి వెల్లంపల్లి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం మద్ది నియోజకవర్గానికి పదవి దక్కితే బాగుంటుందని, పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఇతర మార్గాల్లో ముందుకు వెళ్ళడానికి ఇది పనికి వస్తుందని మల్లాది విష్ణు గట్టిగా పట్టుబడుతున్నారు. 42వ డివిజన్ నుంచి గెలిచిన చైతన్య రెడ్డి పేరును మంత్రి వెల్లంపల్లి ప్రతిపాదిస్తే, 58 వ డివిజన్ నుంచి గెలిచిన శైలజా రెడ్డి పేరును మల్లాది విష్ణు ప్రతిపాదిస్తున్నారు. ఇది ఇలా ఉంటే విజయవాడ తూర్పు నియోజక వర్గానికి ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని పార్టీ యువ నేత దేవినేని అవినాష్ కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో పదవుల పంపకం నేతల మధ్య చిచ్చు పెట్టే లాగా కనిపిస్తోంది. అయితే పదవుల పంపకం విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా కొన్ని సంవత్సరాలు కొందరు చేసేలా ఒప్పందం చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది అన్నది 18 వ తారీకు వరకు వేచి ఉండాల్సిందే.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju