NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

NCT Bill : నిరసనల మధ్య ఆ బిల్లు పాస్ చేసుకున్న కేంద్రం

NCT Bill : దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్‌మెంట్) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు, ఆందోళనలు, వాకట్ ల మధ్య బుధవారం రాత్రి  అధికార పార్టీ ఈ బిల్లును పాస్ చేసుకుంది. ఈ బిల్లు ఇది వరకే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభలు బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో  దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తరువాత ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. లెప్టినెంట్ గవర్నర్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యనిర్వహక నిర్ణయాలు తీసుకోలోని పరిస్థితి ఏర్పడుతుంది.

Rajya Sabha clears NCT Bill
Rajya Sabha clears NCT Bill

బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. కాంగ్రెస్, బీజేడి, వైఎస్ఆర్ సీపీ, సమాజ్ వాది పార్టీ లతో సహా పలు పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సభ్యులు దుయ్యబట్టారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు.

అమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయినందున కేంద్రంలోని బీజేపీ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే..ఈ రోజు భారత రాజ్యాంగానికి జరిగిందని సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ బిల్లు చట్ట సవరణలు ఏ విధంగానూ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం కాదని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో 1991లో కాంగ్రెస్ తీసుకువచ్చిన చట్టానికే సవరణలు చేశాము తప్ప ఇది కొత్తది కాదని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకురావడంలో రాజకీయ కోణం ఏమీ లేదనీ, ఢిల్లీ ప్రభుత్వం సక్రమంగా పని చేసేందుకు ఈ సవరణలను తీసువచ్చామని ఆయన అన్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri