NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupati Bypoll : జనసేన-టీడీపీ కోసమే ఆ రాతలా? బీజేపీ ఎదుగుతుందనే భయమా..?

janasena and bjp fear to that media

Tirupati Bypoll : తిరుపతి ఉపఎన్నిక Tirupati Bypoll తిరుపతిలో ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీలు తమ సత్తా చాటేందుకు ప్రచారంతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. 2019లో ఇక్కడ వైసీపీ గెలిచినా… కొత్త అభ్యర్ధిని నిలబెట్టి సానుభూతి అంశం లేకుండా కొత్తగా పోటీకి సిద్ధమవుతోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసినా వైసీపీ ఈ ఎన్నికను తేలిగ్గా తీసుకోవట్లేదు. మరోవైపు జనసేనతో కలిసి బీజేపీ వస్తోంది. సీపీఐ అండగా టీడీపీ పోటీ చేస్తోంది. అయితే.. ఇక్కడి ప్రజలపై ఊహించని రాజకీయ ప్రలోభాలు నడుస్తున్నాయి.

janasena and bjp fear to that media Tirupati
janasena and bjp fear to that media Tirupati

రాష్ట్రంలో వైసీపీ ఉన్న స్థితి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తేలింది. ఇప్పుడు తిరుపతిలో సత్తా చాటాలంటే గట్టిగానే పోరాడాలి. అయితే.. టీడీపీకి మాత్రమే.. టీడీపీ కోసమే వార్తలు రాసే ఓ పత్రికాధినేత పలికిన పలుకుల్లో బీజేపీ నుంచి జనసేనను వేరు చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ముందు వరకూ వైసీపీ ప్రభుత్వ పథకాలతో ప్రజలు విసుగెత్తారని రాసిన పత్రిక.. ఇప్పుడు అవే పథకాలతో వైసీపీ బలంగా ఉందంటోంది. బీజేపీపై జనసేన గుర్రుగా ఉందని.. తప్పక మద్దతిస్తోందనే ఉద్దేశం కూడా దాదాపు వ్యక్తం చేశారు. బలిజలను ప్రస్తావిస్తూ.. బీజేపీ మతవాద వ్యాఖ్యల తరహాలో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే.. ఈ తరహా వ్యాఖ్యలు జనసేనను బీజేపీ నుంచి దూరం చేసి మళ్లీ టీడీపీ పక్కన కూర్చోబెట్లాలనే ఉద్దేశం కనిపిస్తోంది.

2014లో స్వయంగా చంద్రబాబే హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇంటికెళ్లి మద్దతు కోరారు. ఇప్పుడు ఆ బాధ్యత ఈ పత్రికాధినేత భుజాన వేసుకుంటున్నట్టున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసిన రాజకీయాల వల్ల అనూహ్యంగా బీజేపీ దూసుకొచ్చి.. అక్కడి అధికార పార్టీకి చెమటలు పట్టిస్తోంది. ఇక్కడ ఏపీలో ప్రాభవం కోల్పోతున్న టీడీపీని దాటి బీజేపీ ఎదిగిపోతే తన అభిమాన పార్టీకి ఇంకెంత కష్టం వస్తుందో అనే ఆందోళన ఆ పలుకుల్లో కనిపిస్తోంది. టీడీపీ ప్రత్యేక హోదా నినాదంతో వెళ్తోంది.. వైసీపీ ఎందుకు ప్రశ్నించదు.. అని పలుకుతున్నారు. అలా.. పలికినందుకే టీడీపీ ఈరోజు ఉలుకూ పలుకూ లేకుండా ఉందని ఆయనకూ తెలుసు. వైసీపీని రెచ్చగోట్టేసి, బీజేపీని జనసేనను దూరం చేసేసి.. అభిమాన వ్యక్తులకు లబ్బి చేకూర్చేందుకే ఈ రాతలా..? ప్రజలే ఆలోచించాలి..!!

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju