Vaisshnav Tej : టాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ తీసిన “అర్జున్ రెడ్డి” సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. విజయ్ దేవరకొండ ని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోని చేయటం మాత్రమేగాక సందీప్ రెడ్డి కి స్టార్ డామ్ తీసుకు రావడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ ఇక చాలామంది స్టార్ హీరోలు సందీప్ రెడ్డి తో సినిమా చేయడానికి ముందుకొచ్చారు.
అదే తరుణంలో సందీప్ రెడ్డి కి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ రావడంతో … అక్కడ ఈ సినిమాని షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నరు. అటువంటి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆదిత్య వర్మ తో మెగా కాంపౌండ్ హీరో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు రావడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతోంది.
మేటర్ లోకి వెళ్తే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న మెగాహీరో వైష్ణవ్ తేజ్ కి ఆదిత్య వర్మ ఇటీవల స్టోరీ చెప్పినట్లు అంతా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని నిర్మించడానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వైష్ణవ్ తేజ్ ని కొత్తగా చూపించడానికి.. మాస్ పల్స్ కలిగిన స్టోరీ ఇటీవల ఆయనకు తెలియజేసినట్లు.. మొదటి సిట్టింగ్ లోనే వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ విషయంలో మిగతా కుటుంబ సన్నిహితుల దగ్గర చర్చించి రెడీ అయినట్లు .. హీరోయిన్ గా కీతిక శర్మ ని ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!