Narappa : నారప్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేష్‌కి రీమేక్ కింగ్ అన్న పేరుంది. స్ట్రైట్ సినిమాలతో ఏ రేంజ్లో హిట్స్ అందుకుంటున్నాడో.. రీమేక్ సినిమాలతోనూ అదే రేంజ్లో హిట్స్ అందుకుంటున్నాడు. వెంకీ కెరీర్లో సగం సినిమాలు రీమేక్ సినిమాఏ ఉంటాయి. కాగా మరోసారి తమిళ హిట్ సినిమా అసురన్ రీమేక్ సినిమా నారప్ప సినిమాతో మే 14న వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకీకి జంటగా ప్రియమణి నటిస్తుండగా మరో కీలక పాత్రలో మోనిక జాన్ నటించింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాని సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని త్వరలో మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. కాగా భారీ అంచనాలున్న ఈ సినిమాలోని నారప్పగా వెంకటేష్ లుక్ ఇప్పటికే రివీల్ చేశారు. అయితే వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. తమిళంలో ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అసురన్ చూసిన వారికి కథ గురించి పాత్ర గురించి అవగాహన ఉండే ఉంటుంది.
Narappa : ప్రియమణి పాత్ర సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు.
అయితే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మందికి నారప్పలో వెంకీ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంలో ఆతృతగా బాగా పెరుగుతోంది. ఆ మధ్య ఈ సినిమాలో వెంకటేష్ కంప్లీట్ షేవ్ తో క్లాస్ లుక్ లో ఉన్న పిక్‌ని రిలీజ్ చేశారు. అంటే రెండు రకాల గెటప్స్ లో వెంకీ కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కాగా ఈ సినిమాలో ఊరి కోసం వెంకీ చేసే పోరాటం హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. మాస్ లుక్ లో ఉన్న సీన్స్ అన్ని విపరీతంగా ఆకట్టుకుంటాయట. అంతేకాదు జాతీయ ఉత్తమనటిగా అవార్డ్ సొంతం చేసుకున్న ప్రియమణి పాత్ర సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు.