NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

KUPPAM : ప్రమాణాలు చేస్తే కుప్పం వచ్చేస్తుందా బాబు?

KUPPAM : వివిధ కారణాల రీత్యా మున్సిపల్ ఎన్నికలు జరగని 3 కార్పొరేషన్లు సుమారు 30 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా అయిపోతే పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ పూర్తి చేసినట్లు అవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని గురువారం సాయంత్రం వివిధ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ ఈ దిశగా ఓటర్ల లిస్టు లో సిద్ధం చేసి ఉంచుకోవాలని ఆదేశించారు. అయితే ఈ మిగిలిన మున్సిపాలిటీ లలో చంద్ర బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ ఉండడం తెలుగుదేశం శ్రేణులను మరోసారి కలవరపరుస్తోంది.

is-it-promises-use-in-kuppam
is-it-promises-use-in-kuppam

చిత్తూరు జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలకు తోడు 2018 లో కుప్పం నగర పంచాయతీ ని సైతం మున్సిపాలిటీ స్థాయికి తీసుకు వస్తూ జీవో తీసుకొచ్చారు. అప్పటికే ఉన్న కుప్పం ప్రత్యేక అభివృద్ధి మండలి రెస్కో అలాగే పనిచేసేలా, మున్సిపాలిటీ కు ప్రత్యెక అధికారాలు ఇస్తూ జీవో ఇచ్చారు. అయితే ఎన్నికలు మాత్రం వెంటనే జరుపకుండా ప్రత్యేక అధికారుల పాలనలో నే ఉంచారు. ప్రస్తుతం కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఓటర్ల లిస్టు సిద్ధంగా ఉండటంతో దానిని ఎన్నికల కమిషన్ కు ఇటీవల జిల్లా అధికారులు సమర్పించారు. దీంతో కుప్పం మున్సిపాలిటీకు కు ఎన్నికలు జరిపించడానికి మార్గం సుగమం అయ్యింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసిపి హవా కనిపించింది. 87 పంచాయతీలకు వైయస్ఆర్సీపీ ఏకంగా 73 పంచాయతీని గెలుచుకోవడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరిచింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో నూ అధికార పార్టీ బాగా పుంజుకోవడం, టీడీపీ పూర్తిగా వెనుకబడటం తో ఇప్పుడు కుప్పం ఎన్నికల మీద చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. త్వరలోనే కొత్త మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు వస్తున్న తరుణంలో చంద్రబాబు కుప్పం నాయకులను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు.

కుప్పంలోని నాయకులందరూ చేత ప్రమాణం చేయించుకొని మరి కచ్చితంగా ఈసారి గొప్ప మున్సిపాలిటీ ను సాధించి తీరాలని చంద్రబాబు హామీ తీసుకున్నారు. 20 వార్డులు ఉన్న కుప్పంలో అధికారం చేజిక్కించుకునే మెజారిటీ సాధించాలని చంద్రబాబు నాయకులకు సూచించారు. కచ్చితంగా టీడీపీ బలంగా ఉందన్న సంకేతాలు పార్టీ కి వెళ్లాలని కోణంలో గొప్ప మున్సిపాలిటీలో కచ్చితంగా విజయం సాధించడం అనివార్యంగా ప్రతి నేత చంద్రబాబు పదేపదే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కలిసి కట్టుగా కీలక నేతలు అందరి చేత ఆయన ప్రమాణం చేయించుకొని మరి ఉమ్మడిగా పార్టీ కోసం కష్టపడతాను అని వాగ్దానం తీసుకున్నారు.

అయితే ఈ సమయంలో కూడా గొప్ప నాయకులు పలు రకాల భేదాభిప్రాయాలను అధినేత చంద్రబాబు ముందు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం లోని స్థానిక పరిస్థితులను, నాయకుల మధ్య ఉన్న భిన్నమైన అభిప్రాయాలు చంద్రబాబు వద్ద తేటతెల్లం అయినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా కుప్పం మున్సిపాలిటీలో గెలవాలని చంద్రబాబు సూచిస్తే, మొదట అక్కడ సమస్యలు తీర్చాలని పార్టీ నాయకుడు నుంచి చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇప్పుడు గొప్ప మున్సిపాలిటీలో ఏం జరుగుతుందోనన్న బెంగ చంద్రబాబుతో పాటు పార్టీ నాయకులను స్పష్టంగా కనిపిస్తోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?