NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu Naidu: తీగలాగితే డొంక కదులుతోంది!బాబు మెడకు చుట్టుకోనున్న మరో భారీ స్కామ్ ?

Chandrababu Naidu: తెలంగాణలో ఈఎస్‌ఐ స్కామ్‌లో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతుంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ సోదాలతో ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెరసి.. తీగ లాగితే డొంక కదులుతోంది. మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలు వెలుగు చూస్తుండటం ఇప్పుడు కాక రేపుతోంది. అప్పట్లో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్యతో పాటు.. ఏపీఎస్‌ఎంఐడీసీ ఎండీగా పనిచేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు గోపీనాథ్‌ పేర్లు ఉండటం రాజకీయంగా మరింత హీట్‌ పెంచుతోంది.

Another huge scam around Chandrababu Naidu neck?
Another huge scam around Chandrababu Naidu neck?

సామాన్యుడు తవ్వితీసిన కుంభకోణమిది!

2015 నుంచి జరిగిన ప్రాజెక్ట్‌ టెండర్లలో అక్రమాలు జరిగాయని.. కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు కోట్లాది రూపాయలు తినేశారని గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదులొచ్చాయి. ఐతే అప్పటి ప్రభుత్వం వాటిని లైట్‌ తీసుకోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి. ఆయనిచ్చిన కంప్లైంట్‌ ఆధారంగా విచారణ జరిపిన హైకోర్టుల ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టిగేషన్‌ చేసి ఏసీబీ ఇచ్చిన నివేదికను అప్పటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీఐడీని ఆదేశించారు.ఆ తర్వాత సీఎస్‌గా వచ్చిన నీలం సాహ్ని కూడా మరోసారి దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

అప్పుడు అసలు ఏం జరిగింది ?

2015లో ప్రభుత్వాస్పత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణకు ఏపీఎస్‌ఎంఐడీసీ ద్వారా టెండర్లు పిలిచింది చంద్రబాబు సర్కార్‌. బెంగళూరుకు చెందిన టీబీఎస్‌ ఇండియన్‌ టెలీమాటిక్‌, బయో మెడికల్‌ సర్వీసెస్‌ అనే సంస్థకు టెండర్‌ ఖరారు చేసింది. ఐతే ఈ టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలొచ్చాయి.టెండర్లు దక్కించుకున్న సంస్థ వైద్య పరికరాల విలువను మార్కెట్‌ ధరల కంటే అమాంతం పెంచేసి చీటింగ్‌ చేసిందని ప్రధాన ఆరోపణ. ఏడాదికి 460 కోట్ల రూపాయల భారీ మొత్తానికి టెండర్‌ కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని ఆరోపణలున్నాయి. మొత్తంగా 2వందల కోట్ల రూపాయల విలువజేసే ఎక్విప్‌మెంట్‌ను 5వందల కోట్ల రూపాయలుగా చూపించినట్లు చెబుతున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల మేర నిధులు నొక్కేశారన్న ఆరోపణల నిగ్గు తేలాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.చాలా ఆసక్తికరమైన విషయాలు అతిత్వరలో వెలుగుచూడనున్నాయని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N