NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupati By Poll: హైకోర్టుకు చేరిన తిరుపతి పార్లమెంట్ బై పోల్ పంచాయతీ..

Tirupathi By Poll: Voting Normal but Fake Votes in TPT Polling

Tirupati By Poll: ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ ఒక పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో బయట  ప్రాంతాల నుండి మనుషులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారనీ, అందుకు సంబంధించి పలు అధారాలతో ఇప్పటికే టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ద్వారా ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.

Tirupati By Poll bjp pil ap high court
Tirupati By Poll bjp pil ap high court

ప్రతిపక్షాలు పోలింగ్ పై ఆరోపణలు చేస్తుండగా అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని నివేదిక ఇచ్చారు.  ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడియో టేప్ ఒకటి బయటకు రావడం కలకలాన్ని రేపింది. దొంగ ఓట్లు పోల్ అయ్యాయంటూ టీడీపీ, బీజేపీ నేతల ఆరోపణలకు వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ లు ఇచ్చారు. రిగ్గింగ్ చేయాల్సిన అవసరం వైసీపీ లేదనీ, ఓటమికి ఆ పార్టీలు సాగుగా చెప్పుకోవడానికి విమర్శలు చేస్తున్నాయని కొట్టిపారేశారు. రిగ్గింగ్ జరిగితే 80శాతంకి పైగా ఓటింగ్ జరిగేదని వైసీపీ నేతలు అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్ తో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

అయితే టీడీపీ మాత్రం కోర్టును ఆశ్రయించలేదు. ఈ వ్యవహారంలో తాజాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నేడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు నిలుపుదల చేయాలని, ఎన్నికలను రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆమె కోరారు. ఉప ఎన్నికల పోలింగ్ లో భారీగా అక్రమాలు జరిగాయనీ వాటికి సంబంధించిన అధారాలు తమ వద్ద ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. రేపు విచారణ కు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రత్న ప్రభ దాఖలు చేసిన పిటిషన్ లో ప్రతివాదులుగా ఎన్నికల సంఘంతో పాటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లను చేర్చారు.  ఈ పిటిషన్ పై విచారణ చేయనున్న హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N