NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Ration Door Delivery: అధికారులకు తలనొప్పిగా రేషన్ డోర్ డెలివరీ..! విధుల నుండి తప్పుకుంటున్న ఆపరేటర్ లు..! సోమవారం రేషన్ షాపులు బంద్..!!

Ration Door Delivery: ఏపిలో నిత్యావసరాల డోర్ డెలివరీ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేశంలో మొట్టమొదటి సారిగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించారు. వాహన డ్రైవర్ లకు మొదట రూ.16 వేల వేతనంగా ప్రభుత్వం  నిర్ణయించింది. అయితే ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే తమకు పని భారం ఎక్కువైందనీ, ఈ వేతనాలకు తాము పని చేయలేమంటూ వాహన ఆపరేటర్ లు ఆందోళన నిర్వహించడంతో మరో రూ.5వేలు పెంపు చేసింది. నెలకు 21వేలు వారికి చెల్లింపు జరుపుతోంది.

Ration Door Delivery as a headache for officers ..! Operators retiring from duties
Ration Door Delivery as a headache for officers ..! Operators retiring from duties

అయితే ప్రభుత్వం ఆర్భాటంగా డోర్ డెలివరీ ప్రారంభించినా వాహన ఆపరేటర్ లు ఒక బజారులో వాహనాన్ని నిలుపుదల చేసి అక్కడే ఆ బజారు వారందరికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏదో విధంగా పంపిణీ జరుగుతుంది కదా అంటూ అధికారులు డోర్ డెలివరీపై అంతగా ఒత్తిడి చేయడం లేదు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీని ప్రకటించింది.

మే, జూన్ మాసాలకు అయిదు కేజీల చొప్పున  ఉచిత బియ్యం అందిస్తోంది. దీంతో ఎక్కువ మొత్తంలో బస్తాలను వ్యాన్ లో వేసుకోవాల్సి రావడంతో పాటు కరోనా విజృంభణ భయంతో వాహన డ్రైవర్ లు రేషన్ పంపిణీకి మొగ్గుచూపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాహన డ్రైవర్ లు తాము పంపిణీ చేయలేమంటూ అధికారులకు తేగేసి చెప్పారు. దీంతో అదికారులు పలు ప్రాంతాల్లో డీలర్ లపై ఒత్తిడి చేసి రేషన్ షాపుల లోనే విఆర్ఒ లాగిన్ లో సరుకుల పంపిణీ చేస్తున్నారు.

Ration Door Delivery as a headache for officers ..! Operators retiring from duties
Ration Door Delivery as a headache for officers ..! Operators retiring from duties

Ration Door Delivery: వాహనాలను అధికారులకు అప్పగించిన గుంతకల్లు ఆపరేటర్ లు

అనంతపురం జిల్లా గుంతకల్లులోని 20మంది వాహన ఆపరేటర్ లు తమ వాహనాలను తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.21వేలు డీజిల్, ఇఎంఐ, హమాలీ చార్జీలకే సరిపోతుందనీ, ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ అందట్లేదని పేర్కొంటూ వాహనాలను అప్పగించారు. వెట్టి చారికీ తప్ప తమకు ఎలాంటి లాభం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వాహనాలకు ఖర్చు పెట్టిన పది శాతం నగదు రూ.70వేలు తిరిగి ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని గుంతకల్లు ఆపరేటర్లు అధికారులకు విన్నవించారు.

సోమవారం రేషన్ డీలర్ల నిరసన

వాహన ఆపరేటర్ల సహాయ నిరాకరణ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు డీలర్ లపై ఒత్తిడి తీసుకు వచ్చి పంపిణీ చేయిస్తున్నారు. మోటారు డ్రైవింగ్ యూనిట్లు చేయాల్సిన రేషన్ పంపిణీని డీలర్లు చేయాలని ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. రేషన్ డోర్ డెలివరీ పై విజిలెన్స్ విచారణ జరిపాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి టీకా ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మోటారు డ్రైవింగ్ యూనిట్లు (ఎండియు) పని చేయని ప్రాంతాల్లో డీలర్ లాగిన్ తో పంపిణీ చేయడానికి తమకు అభ్యంతరాలు లేవనీ, అందుకు ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ డోర్ డెలివరీ అని పేరు పెట్టినా ఆ విధంగా పంపిణీ మాత్రం జరగడం లేదు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju