NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP Narendra Modi: మోడీని దించేస్తారా..! “బాధ్యుడే – బాధితుడు” బీజేపీలో బలిపీఠం ఎక్కేదెవరు..!?

BJP Narendra Modi: BJP Will blame PM in Failures

BJP Narendra Modi: హీరో అయినా.. బిజినెస్ మాన్ అయినా.. రాజకీయ పాలకుడికి అయినా ఎల్లకాలం స్టార్ కొనసాగదు.. కొన్ని ఊహించని కల్లోలాలు వచ్చి అనుకోని దెబ్బ వేసి.., ఆ స్టార్ హోదా మొత్తం గల్లంతయ్యేలా చేస్తాయి.. హీరోలకు ఫ్లాప్ సినిమాలు.., బిజినెస్ మాన్ కి నష్టాలు.. రాజకీయ పాలకుడికి సవాళ్లు చేటు చేస్తాయి. ఇప్పుడు మోడీకి టైం వచ్చింది.. పదేళ్లుగా ఆయన నిర్మించుకుంటున్న చరిష్మా మూడు నెలల నుండి పాతాళానికి పోతుంది. జాతీయం, అంతర్జాతీయంగా అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు.. ఇది బీజేపీకి చేటు చేస్తుంది. మరి ఈ అపఖ్యాతిని నెత్తిమీద వేసుకుని ఫలితాలు చవిచూడడానికి బీజేపీ సిద్ధంగా ఉందా..!? దేశంలోని కనీసం 25 రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేసి, వరుసగా మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టాలి అనుకుంటున్న బీజేపీకి ఇది కష్టకాలమే. మరి ఈ కష్టకాలానికి పరిష్కారం ఎవరు..!? బాధ్యుడు ఎవరు..? బాధితుడు ఎవరు..!?

BJP Narendra Modi: BJP Will blame PM in Failures
BJP Narendra Modi: BJP Will blame PM in Failures

BJP Narendra Modi:  ఖ్యాతి ఎలా పడిపోతుంది అంటే..!?

అంతర్జాతీయంగా ప్రముఖ 13 మంది వ్యక్తుల్లో ఉన్న చరిష్మా, ప్రజాదరణ లెక్కలు వేసే అంతర్జాతీయ సంస్థ మార్నింగ్ కన్సల్ట్. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం మోడీకి 23 పాయింట్లు తాగాయి. 2019 చివరి నాటికీ 80 శాతానికి పైగా పాజిటివ్ గా ఉన్న ఆయన ఖ్యాతి ప్రస్తుతం 63 శాతానికి పడిపోయింది. ఇదొక్కటే కాదు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటిష్ మీడియాలు కూడా మోడీ పరిపాలనపై, కరోనని ఎదుర్కోవడంలో వైఫల్యంపై పెద్ద పెద్ద వార్తలు ప్రచురిస్తున్నాయి. మోడీని ఆడిపోసుకుంటున్నాయి. ఇటు జాతీయ కొన్ని మీడియాలు కూడా ఆడేసుకుంటున్నాయి. బీజేపీ ఒత్తిడి లేకపోతే, మీడియా స్వేచ్ఛ ఉంటే బీజేపీపైనా.., మోదీ తీరుపైనా దేశంలోని 90 శాతం మీడియా సంస్థలు వాస్తవమైన కథనాలు వేసేవి. మోడీ వైఫల్యంపై సూటిగా కథనాలు ప్రచురించేవి.. కానీ ఇండియాలో ఈ పరిస్థితి లేదు.. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లోనో.. తటస్థ వేదికల్లోనూ.. కొన్ని సంస్ధ సర్వేలోనూ మోడీ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది..

BJP Narendra Modi: BJP Will blame PM in Failures
BJP Narendra Modi: BJP Will blame PM in Failures

బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా..!?

బీజేపీ దేశంలో ఎదగడానికి కారణం మోడీ. గుజరాత్ లో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. సోషల్ మీడియాలో హీరోగా మారి.. దశాబ్దం కిందట దేశంలో పొలిటికల్ స్టార్ గా ఎదిగారు. బీజేపీకి ఊపు తెచ్చారు. బీజేపీ నావని నడిపించి.. కాంగ్రెస్ పై వ్యతిరేక బాణాలు వేసి 2014 నాటికి దేశం మొత్తం చుట్టేసి, ప్రధాని అయ్యారు. ఆపై కొన్ని సంచలన నిర్ణయాలు, ప్రత్యేక పాలనతో 2019 లోనూ సొంతంగా అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు మోడీకి అంత సీన్ లేదు. గ్రాఫ్ పడిపోతుంది. బీజేపీకి చెడ్డ పేరు వస్తుంది. ఈ నష్టాన్ని బీజేపీ చూస్తూ ఊరుకోదు.
* బీజేపీలో కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ పార్టీలో మొదటి నుండి ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో వెలగడం.. మళ్ళీ ఖ్యాతి కోల్పోవడం సహజమే.. అద్వానీ, వాజపేయి.., మురళి మనోహర్ జోషీ, వెంకయ్య నాయుడు.., నరేంద్ర మోడీ ఈ కోవకే వస్తారు. బీజేపీలో ఎదిగి, మళ్ళీ కిందకు పడిపోయారు. మోడీ ఇదే దశలో ఉన్నారు.
* బీజేపీ ఈ నష్టాన్ని చూస్తూ ఊరుకోదు. ఒక ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకుంటుంది. మోడీని బూచిగా చూపించి.. అవసరమైతే దించేసి ఆయన స్థానానికి అమిత్ షా .. అమిత్ షా స్థానికి జేపీ నడ్డా.., నడ్డా స్థానానికి యోగీ.. యోగీ ఆదిత్యా స్థానానికి.. సూర్యతేజ యాదవ్… ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యామ్నాయం ఉన్నారు. సో.. ఈ అన్నిటినీ చూసుకుని మోడీకి గౌరవర్ధకంగా ప్రెసిడెంట్.. లేదా అధ్యక్షా పాలన తెచ్చేసి అటు మళ్లించడమే బీజేపీ చేస్తుంది అనడంలో సందేహాలు లేవు. 2014 , 2019 లోక్ సభ ఎన్నికలకు మోడీ సారధ్యం వహించగా 2024 నాటికి మాత్రం అమిత్ షా.., నడ్డా, యోగీలు సారధ్యం వహిస్తారని బీజేపీ వ్యూహంగా చెప్పుకోవచ్చు..!

Related posts

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju