NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine: ప్రైవేటు హాస్పటల్స్ లో టీకా ధరలను నిర్ణయించిన కేంద్రం…! ఏ టీకా ధర ఎంత అంటే..?

Corona Vaccine: దేశంలో కరోనా టీకాల కొరత నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు వారి ఇష్టానురీతిలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసు టీకాకు 1,250ల నుండి రూ.1600ల వరకూ మరి కొన్ని చోట్ల రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టీకా డోసు ధరలను నిర్ణయించింది. సర్వీస్ చార్జీ కింద  రూ.150లు కంటే అధికంగా వసూలు చేయడానికి వీలులేదని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ కొరత కారణంగా మంద కొడిగా సాగుతోంది. దానికి తోడు ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ఈ వయసు లోపు వారితో పాటు ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరుతున్నందున ఆక్కడ క్యూలైన్ లలో వేచి చూడలేని వారు    ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

Corona Vaccine rates in private hospitals
Corona Vaccine rates in private hospitals

ఇప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రైవేటు ఆసుపత్రులు ఇంత మొత్తమే తీసుకోవాలనే గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు వారి ఇష్టాను రీతిలో ధరలను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ధరలను నిర్ణయించింది. కోవిషీల్డ్ ధరను గరిష్టంగా రూ.780లు, కోవాగ్జిన్ డోసుకు రూ.1,410లుగా నిర్ణయించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ – వీ వ్యాక్సిన్ కు ఒక్కో డోసుకు రూ.1,145లు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రూ.150లు సర్వీసు చార్జీతో పాటు జీఎస్టీ పనులు కూడా కలుపుకొని ఈ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.

Corona Vaccine rates in private hospitals
Corona Vaccine rates in private hospitals

Read More: YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై మరో సారి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

ప్రైవేటు ఆసుపత్రులు రూ.150లు కంటే ఎక్కువగా సర్వీసు చార్జీలు వసూలు చేయవద్దని పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రులు అంత కంటే ఎక్కువగా వసూలు చేయకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ ధరల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనీ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N