NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

Corona Vaccine: ఏపీ టీకాల్లో తిక్క తిక్క పనులు..! ఇదేమి లెక్క బాసూ..!?

Corona Vaccine: వంద మందికి భోజనం ప్రిపేర్ చేశారు..కానీ 120 మంది వచ్చారు, వారందరికీ ఆ వండిన భోజనం సర్దుబాటు చేయడం తప్పుకాదు. అందరి ఆకలి తీరుతుంది. ఓ వెయ్యి మందికి వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి లక్ష రూపాయలు మంజూరు అయ్యాయి అనుకోండి. అక్కడ 120 మంది ఉన్నారు. అప్పుడు ఏమి చేయాలి. ఈ వెయ్యి మందికి ఎంతో కొంత నగదు తగ్గించి ఇచ్చి మిగతా 20 మందికి సర్దుబాటు చేయడం కరెక్టే అంటారా? తమకు వచ్చిన నగదులో తగ్గించడానికి వారు ఒప్పుకుంటారా?  అయితే డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్సఫర్ అయితే ఇచ్చినంత తీసుకోవాలి, నోరు మెదిపే అవకాశం కూడా ఉండదు. ఇదంతా ఎందుకు అంటే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లీల ఒకటి తాజాగా బయటపడింది.

Gimmicks in the distribution of Corona Vaccine
Gimmicks in the distribution of Corona Vaccine

కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం నుండి కొన్ని ప్రాంతాల నుండి ఓ విమర్శ వస్తున్నది. ప్రజలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ డోస్ ను సక్రమంగా ఇవ్వకుండా కొంత మిగుల్చుకొని ఆ వ్యాక్సిన్ డోసులను ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖలోని కొంత మంది సిబ్బంది అమ్ముకుంటున్నారనే విమర్శ ఉంది. కొన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని 1ఎంఎల్ కంటే తక్కువ డోస్ ఇస్తుండటంపై నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో చాలా వరకు ఎఎన్ఎంలు, నర్స్ లు అందరూ వ్యాక్సిన్ సక్రమంగా ఇవ్వడం వచ్చిన వారే. అయితే వారి విధి నిర్వహణ ప్రకారం కశ్చితంగా 1 ఎంఎల్ మోతాదులో ఎందుకు ఇవ్వలేదు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. సిబ్బంది కశ్చితంగా వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వలేదు అని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. దాన్ని ఆ శాఖ అధికారులు సమర్ధించుకుంటున్నారు అనుకోండి. అది వేరే విషయం.

Gimmicks in the distribution of Corona Vaccine
Gimmicks in the distribution of Corona Vaccine

 

Read More: Loan App Case: ఈడీలోనూ అవినీతి తిమింగళం..! కేసు నమోదు చేసిన సీబీఐ..!!

ఏపికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు మొత్తం కలిపి  98 లక్షల 85వేల 650 డోసులు వస్తే మన పని తనం కల్గిన కొందరు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పొదుపుగా వ్యాక్సిన్ వేయడం వల్ల అదనంగా మరో 2లక్షల మందికి అంటే మొత్తంగా కోటి 74వేల 471 డోసులు ఇచ్చారు అన్నమాట. 98,85,650 డోసులు వస్తే కోటి మందికిపైగా ఇచ్చారు అంటే ఒక విధంగా అభినందించాల్సిందే. కానీ ఇది కరెక్టా. ఇవ్వాల్సిన మోతాదులో ఎందుకు ఇవ్వలేదు. అడిగేది ఎవరు.

క్వాలిఫైడ్ అయిన ఎఎన్ఎంలు, నర్సులు వ్యాక్సిన్ నిబంధనల ప్రకారం కశ్చితంగా 1 ఎంఎల్ ఇవ్వలేక పోయారా లేక కావాలనే మిగల్చడంతో 1 ఎంఎల్ కంటే తక్కువ వేశారా. ఈ వ్యాక్సిన్ లెక్కలు కాగ్ కు ఇస్తే మాత్రం తప్పకుండా తప్పుబడుతుంది. ఎన్ని డోసులు వస్తే అంత మందికి సరిపోయేలా ఇస్తే దుబరా (వేస్టేజ్) జరగనట్లు. తక్కువ మందికి టీకా వేస్తే కొంత వేస్టేజ్ జరిగినట్లు లెక్క. అదే వచ్చిన డోసుల కంటే ఎక్కువ డోస్ లు వినియోగించినట్లు లెక్క చెబితే అది తప్పు జరిగినట్లు కాదంటారా మీరే చెప్పండి.

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju