Love story : లవ్ స్టోరి.. సాయి పల్లవి, నాగ చైతన్య అక్కినేని నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి. ట్రైన్ టీజర్, ప్రచార చిత్రాలు..సారంగ దరియా సాంగ్ క్రియేట్ చేసిన రికార్డ్ ..ఇలా చాలా అంశాలు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని మేకర్స్ కి కలిగించాయి. మొదటి సారి సాయి పల్లవికి జంటగా అక్కినేని నాగ చైతన్య కలిసి నటించడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. శేఖర్ కమ్ముల ఈ సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరిగా ఈ సినిమాన్ని తెరకెక్కించారు. మేకింగ్ పరంగా మంచి హైప్ క్రియేట్ అయింది లవ్ స్టోరి సినిమా మీద.
అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న చిత్ర బృందం ఏప్రిల్ నెలలో గ్రాండ్గా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కొట్టిన సడన్ దెబ్బకి ఇండస్ట్రీలో అన్నీ పరిస్థితులు మారిపోయాయి. సినిమాలన్ని ఎక్కడికక్కడే షూటింగ్ స్టేజ్ లో స్థంభించి పోయాయి. అలాగే ల్యాబ్ నుంచి బయటకు రావాల్సిన సినిమాలు కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులన్నీ కాస్తో కూస్తో సర్దుకుంటున్నాయి. అందుకే దర్శక, నిర్మాతలు నెమ్మదిగా సినిమాలను సెట్స్ మీదకి తెచ్చేలా షెడ్యూల్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
Love story : ఆగస్టులో రిలీజ్ చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారట.
ఈ క్రమంలో రిలీజ్ డేట్ అన్నీ ఫిక్స్ చేసుకున్న సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇదే వరుసలో శేఖర్ కమ్ముల – నాగ చైతన్య – సాయి పల్లవి ల సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఇంకా ఆగస్టులో డేట్ లాక్ చేయలేదు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక సాయి పల్లవి విరాట పర్వం అనే నక్సలైట్ బ్యాక్ డ్రాప్ అండ్ డిఫ్రెంట్ లవ్ స్టోరి లో కూడా నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ గా ఉంది. చూడాలి ఈసారైనా అనుకున్నట్టుగా సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!