NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: RRR విషయంలో ఆ ఒక్క తప్పులో వైసీపీ స్ట్రాంగ్ గా దొరుకుతుంది..!

YSRCP: రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది.. నిజమే ఆయన ఎంపీగా అనర్హుడు.. వైసీపీ జెండాతో గెలిచి.., జగన్ ఫొటోతో గెలిచి.. ఆ పార్టీని, ఆ వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం నైతికత కాదు. ఆయనను తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలి.. ఇక్కడ వైసీపీ వాదనలో బలం ఉంది..! కానీ ఒక పెద్ద నైతిక చిక్కులో వైసీపీ చిక్కుకుంటుంది. ఒక పెద్ద తప్పులో వైసీపీ కాలేసింది. అడ్డంగా దొరికిపోయింది కూడా..!

YSRCP: ఆ నలుగురి కథకీ – ఈ ఒక్కడికీ లింకు..!?

రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో సభ్యులకు (ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా) ఒకే తరహా హక్కులు/ అధికారాలు ఉంటాయి. వారి గెలుపు, ఐదేళ్లు పదవీ కాలం, హక్కులు, ప్రోటోకాల్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే పరిధి మాత్రమే పెరుగుతుంది. సో.. ఈ లెక్కన ఎంపీ రఘురామకృష్ణం రాజు కోటాలోకే ఏపీలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.., విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.., గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్.. ఈ నలుగురు 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. వారిలో ఇద్దరు (వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్) టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.., మిగిలిన ఇద్దరు మాత్రం దోబూచులాడుతున్నారు..! సో… నైతికంగా చూసుకుంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలకు రఘురామకృష్ణంరాజుకి లింకు ఉంది. వీరికి ఒకేరకమైన చట్టసభ నిబంధనలు, రాజ్యాంగ హక్కులు వర్తిస్తాయి..

YSRCP: Parti Big Mistake in RRR Issue
YSRCP: Parti Big Mistake in RRR Issue

ఎవరిని.. ఎవరు.. ఎలా సమర్ధించగలరు..!?

ఏపీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనధికారికంగా వైసీపీలో చేర్చుకున్నారు. ఆ పార్టీ అధినేతని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మైక్ దొరికితే తిడుతున్నారు. దాన్ని వైసీపీ సమర్థిస్తుంది. వారికి ఆ పార్టీ విధానాలు నచ్చలేదు కాబట్టి తిడుతున్నారు అని వెనకేసుకొస్తుంది.. చంద్రబాబు రాజకీయం నచ్చలేదు, టీడీపీ అంటే గిట్టక వచ్చేసారు. వైసిపిలో చేరలేదు కదా..! అని వాదిస్తుంది. ఇక్కడ ఇదే కోవలోకి రఘురామకృష్ణంరాజు వ్యవహారం కూడా వస్తుంది.. ఆయన కూడా పార్టీ విధానాలు నచ్చలేదు కాబట్టి వైసిపిని, సీఎం జగన్ ని తప్పుపడుతున్నారు.. ఎంపీని ఏ రూల్ ప్రకారం అనర్హత వేటు వేయాలని వైసిపి కోరుతుందో… అదే రూలు ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలను కూడా అనర్హత వేటు వేయాలి. వాళ్ళు నలుగురినీ అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇచ్చినప్పటికీ ఫిర్యాదు స్పీకర్ పట్టించుకోలేదు.. ఇక్కడ వైసిపి కి చెందిన అసెంబ్లీ స్పీకర్ ఆ నలుగురినీ అనర్హులుగా చేస్తే, అక్కడ పార్లమెంటులో వైసిపి నైతికత నిరూపించుకుని.. దీన్ని ఉదాహరణగా చూపించి రఘురామా విషయంలో గట్టిగా పోరాడవచ్చు.. అప్పటి వరకు వైసిపి ఎన్ని చేసినా నైతికత విషయంలో వెనకడుగు వేసినట్టే.. టీడీపీకి, రఘురామకి ఇదే పెద్ద ఆయుధంగా దొరుకుతుంది..!

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N