Akhanda: బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు “అఖండ”లో విలన్ పాత్ర లో శ్రీకాంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డిఫరెంట్ పాత్రలో బాలయ్య బాబు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఒకటి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షన్ పాత్ర కాగా మరొకటి “అగోర” పాత్ర కావటంతో “అఖండ” పై అంచనాలు ఓ రేంజిలో అభిమానులలో ఏర్పడ్డాయి. ముఖ్యంగా గతంలో బోయపాటి సింహా, లెజెండ్ వంటి రెండు బ్లాక్ బస్టర్ విజయాలు మర్చిపోలేని రీతిలో ఇవ్వటంతో ఈ సినిమా పై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యొక్క సీక్రెట్స్.. శ్రీకాంత్ రీసెంట్ ఇంటర్వ్యూ లో బయట పెట్టారు. ముఖ్యంగా అగోర పాత్ర అనేది సినిమా మొత్తానికే హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అది ఒక పాత్రగా పరిగణించకుండా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆ క్యారెక్టర్ పై శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
Read More: Akhanda: బాలకృష్ణ ఆఘోర క్యారెక్టర్ లో అన్నిటికంటే అదే హైలెట్ అంట..??
ముఖ్యంగా తన కి బాలయ్య బాబు కి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లో దద్దరిల్లి రీతిలో ఉంటాయని స్పష్టం చేశాడు. వరదరాజులు అనే క్యారెక్టర్ తాను చేస్తున్నట్లు శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఇక బాలయ్య బాబు డైలాగులు.. థియేటర్లో మారు మోత మోగుతాయి ఆ రీతిలో .. సన్నివేశాలు బోయపాటి చిత్రీకరించాడని పేర్కొన్నారు. దీంతో తాజాగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలతో అఖండ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.