NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Visakha: విశాఖ పరిపాలనా రాజధాని అయిపోయింది..! ఇదిగో సాక్షం..!?

Visakha ap administrative capital?

Visakha: ఏపి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇంకా కోర్టు సమీక్షలో నలుగుతూనే ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టే కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి ప్రాంతం నుండి తరలించడానికి వీలులేదంటూ ఓ పక్క ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో పక్క మంత్రి బొత్సా సత్యనారాయణ, వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి తదితర వైసీపీ నేతలు త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమంటూ చెప్పుకొస్తునే ఉన్నారు.

Visakha ap administrative capital?
Visakha ap administrative capital?

Read More: Twist In Marriage: పెళ్ళయిన రెండు నెలలకు అసలు విషయం తెలిసి వరుడు షాక్..! మేటర్ ఏమిటంటే..!?

ఈ తరుణంలోనే విశాఖ నుండి భీమిలి – భోగాపురం వరకూ తీర ప్రాంతాన్ని వేర్వేరు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశాఖ బీచ్ రోడ్ కారిడార్ కార్పోరేషన్ పేరిట ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పర్యాటక, వాణిజ్య, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను విశాఖ బీచ్ రోడ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం 570 ఎకరాల్లో రూ.1021 కోట్లతో విశాఖ బీచ్ రోడ్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. బీచ్ రోడ్ లో రిసార్టులు, గోల్ఫ్ కోర్సులు, కైలాసగిరి వద్ద ఫ్లోటింగ్ షిప్ రెస్టారెంట్ తదితర ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Visakha ap administrative capital?
Visakha ap administrative capital?

విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ విశాఖ రాష్ట్ర పరిపాలనా రాజధాని అయిపోయినట్లుగా (డిక్లేర్) ఉంది. “రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు” అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖ అని విజయసాయి సంభోధించడంపై నెటిజన్ల నుండి విమర్శలు వస్తున్నాయి. విజయసాయి ట్వీట్ లకు నెటిజన్ ల నుండి వ్యతిరేక కామెంట్స్ ఎక్కువగా వస్తున్నా అవేమి పట్టించుకోకుండా తనదైన ఫందానే కొనసాగిస్తుండటం విమర్శలకు దారి తీస్తున్నది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N