NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSR: వైఎస్ పై తెలంగాణ నేతల విసుర్లు..! రాజకీయమే కారణమా ..?

telangana politicians comments on ysr

YSR: వైఎస్సార్ YSR వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేతగా తెలుగు ప్రజలు ఆయన్ను మరచిపోలేరు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, రుణమాఫీ.. పథకాలతో పాలనలో తనదైన మార్క్ చూపారు.  ఆయన హఠాన్మరణం అభిమానుల్లో తీవ్ర వేదన మిగిల్చింది. ఏపీ సీఎంగా జగన్ ఎన్నికయ్యాక వైఎస్ అభిమానులు తమ నాయకుడిని జగన్ లోనే చూసుకుంటున్నారు. మొత్తంగా ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ, తెలంగాణలో వైఎస్ ను ప్రస్తావించే అవసరం కానీ.. ఆయన్ను మాటలు అనే పరిస్థితులు కానీ.. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాలేదు. కానీ.. ఇప్పుడు వైఎస్ ను తెలంగాణ నాయకులు దూనమాడుతున్నారు. వారి మనసుల్లో ఉండిపోయిన మాటలో.. ప్రస్తుత రాజకీయాల వల్లో కానీ.. తీవ్రంగానే విమర్శిస్తున్నారు.

telangana politicians comments on ysr
telangana politicians comments on ysr

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈక్రమంలో తెలంగాణ నేతలు ఏపీ ప్రజలను, నేతలను.. చనిపోయిన వైఎస్ ను కూడా వదలడం లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఉద్యమంలో అంతమంది చనిపోవడానికి వైఎస్సే కారణం. పీజేఆర్ ను వైఎస్ అవమానించడం వల్లే గుండె ఆగి చనిపోయారు. వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదని.. ఇప్పటికీ ప్రజలు అనుకోవడం లేదా?’ అంటూ వైఎస్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మంత్రి ప్రశాంత్ కూడా వైఎస్ ను ఏపీ ప్రజలను కూడా తిట్టేశారు. ఇదంతా రాజకీయంగా కాక రేపుతోంది. అయితే..

Read More: YS Sharmila: షర్మిలకు కేసీఆర్ కౌంటర్..! సైలంట్ గా.. సిస్టమాటిక్ గా..!!

చనిపోయిన వైఎస్సార్ ను ఇప్పుడు తిట్టాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణాలు చూస్తే.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఆర్నెల్లుగా సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఆయన ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు ఉన్నపళంగా ప్రాజెక్టుల విషయం తీసుకొచ్చి.. మంత్రులతో వైఎస్ ను మాటలు అనిపించి.. ఇటు షర్మిలను.. అటు జగన్ ను రెచ్చగొట్టే ప్లాన్ వేశారని చెప్పాలి. తండ్రిని సమర్ధిస్తున్న షర్మిలను తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తిగా ప్రజల్లో చూపడం.. ఓ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇటు ఏపీతో కయ్యం కారణంగా కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తేవచ్చు. ప్రస్తుతం కేసీఆర్ అదే చేశారు. ఇదంతా చూస్తే.. రాజకీయాల కారణంగా వైఎస్ ను మధ్యలోకి తీసుకొస్తున్నారని చెప్పాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?