NewsOrbit
న్యూస్ సినిమా

Sathyadev : సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏదైనా కావాల్సింది ఇప్పుడు సత్యదేవ్..

Sathyadev : టాలెంటెడ్ డైరెక్టర్ సత్యదేవ్ ఇప్పుడు సౌత్ లో బిజీ హీరో. ఆయన చేతిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. కథ నచ్చితే దేనిని ఆయన వదలడం లేదు. స్టార్ హీరోలైనా ఆచి తూచి కమిటవుతారేమో గానీ సత్యదేవ్ మాత్రం తనకి ప్లస్ అవుతుందనుకుంటే మాత్రం సైన్ చేసేస్తున్నాడు. సత్య దేవ్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. జ్యోతిలక్ష్మీ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు చేసినా కూడా ఘాజీ లాంటి సినిమాతో ఇండస్ట్రీలో అందరి చూపు
ఆయన మీదే పడింది. అయితే మరోసారి దర్శకత్వంలో నటించే అవకాశం అందుకున్న సత్య దేవ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు.

 

sathyadev-has become most wanted for movies and web series
sathyadev-has become most wanted for movies and web series

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. ఎంతగా అంటే కొందరు దర్శకులు ఇప్పుడు సత్యదేవ్ ని దృష్టిలో పెట్టుకొనే కథలు రాస్తున్నారు. అలాగే తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పడం బాగా కలిసి వచ్చింది. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేస్తుంటే హీరోలకి సత్య దేవ్ తన గొంతు అరువిస్తున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సత్యదేవ్ హీరోగా రూపొందిన ‘లాక్డ్’ వెబ్ సిరీస్ కు సీక్వెల్ తయారవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ని కూడా మేకర్స్ ఇచ్చారు.

Sathyadev : ‘రామ్ సేతు’లోముఖ్య పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు.

కాగా ప్రదీప్ దేవకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఇందులో సత్యదేవ్ తో పాటు సంయుక్త, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. న్యూరో స్పెషలిస్ట్ చుట్టూ కథ తిరుగుతూ ఎంతో ఉత్కంఠ భరితంగా తెరకెక్కిన ‘లాక్డ్’ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన వాటిలో ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. దీనికి సీక్వెల్ గా ‘లాక్డ్ 2’ రాబోతున్నట్లు తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. ఇక సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘తిమ్మరుసు’ చిత్రం జూలై 30న
థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గోపిగణేశ్ పట్టాభి దర్శకత్వంలో రూపొందుస్తున్న ‘గాడ్సే’, అలాగే తమన్నాతో కలసి చేస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’సినిమాలున్నాయి. అంతేకాదు ‘భగవద్గీత సాక్షిగా’ అనే కొత్త సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’లోముఖ్య పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు.

Related posts

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri