Partner: డిన్నర్ లో కి నీకు ఇష్టమైన వంటకాలు రెడీ చేస్తున్న.. అని చెప్తే,తనకు నచ్చిన ఆహారం అదీ మీరు స్వయంగా చేసి పెడుతుంటే చాలా ఆనంద పడుతుంది.పిరియేడ్ వంచింది అని తెలియగానే మందులు, ప్యాడ్స్ లాంటివి ఏమైనా కావాలా? అని అడిగి తెలుసుకుని తెచ్చి ఇవ్వండి . కేరింగ్‌లో ఇలాంటివి కూడా ముఖ్యమే కదా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. నువ్వు విశ్రాంతి తీసుకో అన్ని నేను చూసుకుంటా అని ఈ మెసేజ్ పంపిన మీ భాగస్వామికి చాలా ఆనందాన్ని,
ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ల చిరాకు ను కూడా పోగొడుతుంది.ఐ లవ్ యూ..సందర్భం ఏదైనా .. మూడ్ ఎలా ఉన్నా, ఈ మూడు పదాలు అవతలి వ్యక్తి మూడ్‌ని వెంటనే మార్చేసి వారి మొహం లో వెలుగులు రప్పిస్తుంది. అందుకే వీలున్నప్పుడల్లా ఈ పదం తో మీ ప్రేమను తెలియచేయండి.ఒకవేళ మీరు తన దగ్గరే ఉంటే మాత్రం.. కొన్ని సేవలు చేయండి.. స్నానం కోసం వేడి నీళ్లు.. నొప్పులకు కాపు కోవడానికి హాట్ బ్యాగ్ .. లాంటివి రెడీ చేసి పెట్టండి.. తనకి నొప్పి ఎక్కువగా ఉంటే మీరు తన దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకునే విధంగా చేయండి.
మీరు ఇలా చేయడం వలన మీ భాగస్వామి కి మీకు మధ్య ప్రేమ బంధం మరింత పటిష్టమవుతుంది. ఎందుకో తెలుసా ఆ సమయంలో వచ్చే నొప్పులు ఎంత గా ఉంటాయో మీరు కనీసం ఊహించలేరు. ఒకపక్క అస్తమానం మారిపోయే మూడ్,మరోపక్క నొప్పి,నీరసం.. కేవలం మీ ప్రేమ మాత్రమే వాటినుండి ఉపశమనం కలిగించ గలదు అని ఎప్పుడు మర్చిపోకండి.