partner: పీరియడ్స్ చిరాకుగా అనిపించడం, కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలెన్నింటితోనో బాధపడుతుంటారు అమ్మాయిలు.. ఇలాంటి సమయంలో తన భర్త లేదా బాయ్ ఫ్రెండ్ తనని కాస్త ప్రత్యేకంగా చూడాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకే అబ్బాయిలు ఓ సలహా… పిరియడ్స్ సమయంలో మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ని మీరు ప్రేమ గా చూసుకుంటే చాలు.. వాళ్లకు మీ మీదున్న ప్రేమ రెట్టింపవుతుందన్నది నిజం.
ప్రేమ పొందుతున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు వల్ల పీరియడ్స్ నొప్పి నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మీ భాగస్వామి కి పంపే మెసేజ్లతో వారి మూడ్ రిలాక్స్ అయ్యేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారు రిలాక్స్ అవ్వడం తో పాటు.. మీ ప్రేమ బంధం బాగా బలపడుతుంది. ఇలాంటి సమయంలో, మీరు ఎలాంటి మెసేజ్లు పంపాలో చూద్దాం.. నీకిష్టమైన ఫుడ్ అంది చాక్లెట్లు, తీసుకొస్తున్నా… ఫుడ్ పని అనగానే ఇద్దరం కలిసి ఏదైనా మంచి సినిమా చూద్దాం.. అని మీరు ఈ మెసేజ్ చేస్తే, మీకు వారిపై ఎంత ప్రేమ ఉందో వారికి కచ్చితంగా గా అర్థమవుతుంది.
అయ్యో నొప్పిగా ఉందా.. బంగారం. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వచ్చేస్తా. ఇలా మెసేజ్ చేస్తే తన భాగస్వామి అంటే ఎంత ప్రేమ.. ఆమెను ఎంత మిస్సవుతున్నా రో తెలియడానికి ఈ మెసేజ్ ని మించింది లేదు.
నేను నీ గురించి ఆలోచిస్తున్నా అని అన్నారంటే భరించలేని నొప్పితో బాధపడుతున్న సరే.. ఈ మాట తన ముఖం వెలిగిపోయేలా చేస్తుంది. నా బేబీ.. ఈరోజు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీం తినాలనుకుంటుంది అని అడగడం తో మీ ప్రేమను తెలియజేయవచ్చు.