NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad by poll: ఎన్నికల సంఘానికి రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే కీలక లేఖ..! మేటర్ ఏమిటంటే..?

Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ హుజూరాబాద్ పై దృష్టి సారించాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో నేతలు ఇప్పటి నుండి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల కాలం వరకూ ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అనుకుంటుండగా టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుంది.

gone prakash rao letter to election commission for Huzurabad by poll issue
gone prakash rao letter to election commission for Huzurabad by poll issue

తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరనుండటంతో బీఎస్పీ తరపున ఆయన రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ ఈటలకు ఉప ఎన్నికల్లో గట్టిగా సమాధానం చెప్పి తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదు, కేసిఆర్ కు ఎదురులేదు అని నిరూపించేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయలతో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపడుతోంది. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర పథకాలకు అర్జీలను స్వీకరించడంతో పాటు పెద్ద ఎత్తున నిధులను నియోజకవర్గంలో అభివృద్ధికి కేటాయిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హుజూరాబాద్ ఎన్నికలను  పురస్కరించుకుని ఎన్నికల సంఘానికి లేఖ రాసి సంచలనానికి తెర తీశారు. హూజూరాబాద్ లో ఉప ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లేకుంటే టీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలను నియోజకవర్గంలో ఖర్చు చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, పోలీసుల సహయంతో ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతోందని లేఖలో గోనె పేర్కొన్నారు. ఎన్నికలు నిస్పక్షపాతం జరగాలంటే పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గోనెల కోరారు. అదే విధంగా ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల వ్యవహారంపై కూడా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని గోనెల విజ్ఞప్తి చేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju