NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: నకిలీ చలానాల కుంభకోణంపై సీఎం జగన్ ఆరా..!!

AP CM YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అక్రమాలకు పాల్పడిన వారి నుండి సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.40లక్షల మేర సొమ్ము రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్లు సీఎం వివరించారు. ఈ కుంభకోణానికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు సీఎం జగన్ అదేశించారు.

AP CM YS Jagan review on fake challans issue
AP CM YS Jagan review on fake challans issue

ఇప్పటికే కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. 2021 ఏప్రిల్ నుండి జూలై వరకూ 54 నకిలీ చలానాలు గుర్తించారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్ మాల్ జరిగినట్లు నిర్ధారించారు. చలానాల గోల్ మాల్ లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు నిర్వహించగా మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

ఏడు రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.7.95 లక్షలు విలువైన నకిలీ చలానాలు జత చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఏడు కేసులు నమోదు చేసినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుండి వినియోగంలోకి రానున్నదనీ, కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తే ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల లో ఈ కుంభకోణం వెలుగుచూడటంతో ప్రభుత్వం స్పందించింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju