NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh babu: మ‌హేష్‌బాబు హీరోగా నిల‌దొక్కుకునేందుకు వాళ్ళని వాడుకున్నాడా..?

Mahesh babu: ఎవ‌రి బొమ్మ వెండితెర‌పై ప‌డితే క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసి రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయో ఆయ‌నే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు. ఇది కాస్త అటు ఇటుగా పూరి జగన్నాథ్ డైలాగ్‌లా ఉన్నా కూడా అదే నిజమని చెప్పాలి. తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ నుంచి న‌ట‌న‌ని, మంచిత‌నాన్ని, అందాన్ని వార‌స‌త్వంగా అందుకున్న ప్రిన్స్ మ‌హేష్ బాబు తండ్రి బిరుదు సూప‌ర్ స్టార్‌ ని దక్కించుకొని టాలీవుడ్ ని అగ్ర హీరోగా ఏలుతున్నాడు. తండ్రిని మించిన త‌న‌యుడిగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

is mahesh-babu became hero because of them
is mahesh-babu became hero because of them

మ‌హేష్ బాబుని ఎప్పుడూ చూసినా కాలేజీ కుర్రాడిలా క‌నిపిస్తాడు. టాలీవుడ్‌లో వయసు పెరిగే కొద్దీ చిన్న కుర్రాడిలా మారుతున్న హీరో అంటే ఒక్క మహేష్ బాబు మాత్రమే. 45 ఏళ్లు వ‌య‌స్సు దాటినా… 40 ఏళ్ల‌కు పైగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌తో అవినాభావ సంబంధంతో కొన‌సాగిస్తూన్న వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు. చిన్నతన నుంచే నటన మీద దృష్టి పెట్టిన మహేష్ ఈ హీరో ఇంత స్టార్ డం సంపాదించుకున్నాడంటే దాని వెనక ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.

Mahesh babu: ఈ స‌క్సెస్ తో మొద‌లైన విజ‌య‌యాత్ర అలా కొన‌సాగుతూనే ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ 35కి పైగా సినిమాల‌లో న‌టించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. బాల నటుడిగా తెరంగేట్రం చేసిన కొత్త‌లో 9 సినిమాల‌లో, హీరోగా 26 చిత్రాల‌లో న‌టించారు. మహేష్ కెరీర్‌లో ఎక్కువ బ్లాక్ బస్టర్స్ ఉండటం విశేషం. ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్‌లో మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన‌ తొలి సినిమా రాజకుమారుడు. ఈ స‌క్సెస్ తో మొద‌లైన విజ‌య‌ యాత్ర అలా కొన‌సాగుతూనే ఉంది. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ‘మురారి’ సినిమాతో మ‌హేష్‌ మంచి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

రొటీన్ క‌థ‌లు, న‌ట‌నకి దూరంగా కొత్త‌ద‌నానికి ద‌గ్గ‌ర‌గా వుండే మహేష్‌బాబు, తండ్రి కృష్ణలాగే మహేష్ డేరింగ్ డాషింగ్. ఆ రూట్లోనే మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరిదొంగ అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు. అలాగే విభిన్న క‌థాంశంతో తీసిన నిజం, బాబీ, నాని, వంశీ, స్పైడ‌ర్‌, బ్ర‌హ్మోత్స‌వం వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. శ్రీనువైట్ల డైరెక్షన్ లో చేసిన దూకుడు మహేష్‌ కెరీర్ లోనే భారీ విజయంగా నిలబడింది. బిజినెస్ మేన్ మహేష్‌బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

Mahesh babu: మహేష్‌ సక్సెస్‌లో ప్రధాన భాగం ఆయన భార్య నమ్రత

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్కడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతడు’ సినిమా మహేష్ బాబు న‌ట‌న‌లోని వైవిధ్యాన్ని వెలికి తీసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ లో యాక్ష‌న్ చూసిన తెలుగుప్రేక్ష‌కుల మైండ్ దిమ్మ‌దిరిగిపోయింది. 75 ఏళ్ల రికార్డ్స్ బ్రేక్ చేయడం గొప్ప విశేషం. ఏ టాలీవుడ్ హీరోకి లేని మార్కెట్ ఓవ‌ర్సీస్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకి ఉంది. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల‌తో మ‌హేష్‌బాబు ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తుకి ఎదిగారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో రాబోతున్నాడు.

అయితే తండ్రి హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, స్టూడియో య‌జ‌మాని. కానీ ఈ బ్యాక్‌గ్రౌండ్ మ‌హేష్‌బాబు తాను హీరోగా నిల‌దొక్కుకునేందుకు వాడుకోకపోవడం విశేషం.
ప్రస్తుతం మహేష్‌ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు నిర్మాతగా పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలను నిర్మిస్తున్నాడు. సామాజిక బాధ్యత భుజాన వేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మహేష్‌ సక్సెస్‌లో ప్రధాన భాగం ఆయన భార్య నమ్రత పాత్ర కీలకంగా ఉందని గర్వంగా సూపర్ చెప్పుకుంటుంటాడు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!