NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

White Spots: గోళ్ళపై తెల్లమచ్చలు ఉంటే ప్రమాదమా..!?

White Spots: అలంకరణలో అందమైన గోళ్ళు కూడా ఒక భాగమే.. గోళ్ళ ఆరోగ్యం మనుషుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు.. గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. అయితే గోళ్ళ పై తెల్ల మచ్చలు ఉంటే అది దేనికి సంకేతం..!! ఎటువంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

White Spots:  On Nails See what happens
White Spots: On Nails See what happens

White Spots: గోళ్ళ పై తెల్ల మచ్చలు ఉంటే వీటికి సంకేతం..!!

కొంత మంది చేతి వేళ్ళ పై సహజం గానే తెల్లని మచ్చలు ఉంటాయి. అయితే ఇవి కొందరికి ఎక్కువగా కొందరి వేళ్ళ పై మచ్చలు చిన్నగా ఉంటాయి. మరి కొందరికి మాత్రం వెడల్పుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఇవి ఎందుకు వచ్చాయో తెలియక భయపడుతుంటారు. దీనిని లుకొనైకియా (Leukonychia) అంటారు. ఇది చాలా సాధారణ సమస్యే. కానీ ఈ తెల్లని మచ్చలు కొన్ని అనారోగ్య సమస్యలకు వచ్చే ముందు కనిపించే లక్షణాలు. కిడ్నీ (Kidney) సంబంధిత సమస్యలు వచ్చే ముందు గోళ్ల పై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. గోర్లు సాధారణంగా తెల్లగా, పింక్ కలర్ లో ఉంటాయి. అయితే అవే గోర్లు తెల్లగా, పేలవంగా మారితే అది కిడ్నీ ఫెయిల్యూర్ (Kidney Failure) కు సంకేతం.

White Spots:  On Nails See what happens
White Spots: On Nails See what happens

గోళ్ళ పై తెల్ల మచ్చలు ఉంటే కొన్ని సీరియస్ డిసీజ్ లకు ఇది లక్షణాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మచ్చలు లివర్ (Liver), హైపటైటిస్ (Hepatitis) వ్యాధులకు దారితీస్తుంది. ఇంకా హార్ట్ ఎటాక్ (Heart Attack) వచ్చే ముందు ఈ సూచనలు వస్తాయి. గోళ్ళ పై తెల్ల మచ్చలు, గోర్లు నిర్జీవంగా మారినట్లు కనిపిస్తే ఐరన్ లోపం (Iron Deficiency) ఉందని తెలుసుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా పాలు, పాల పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, గుడ్లు కూడా ఎక్కువగా తినాలి.

White Spots:  On Nails See what happens
White Spots: On Nails See what happens

కొంత మందికి నెయిల్ పాలిష్ (Nail Polish) వేసుకుంటే సరిపడదు. వారికి ఇలా తెల్ల మచ్చలు వస్తాయి. క్యాల్షియం (Calcium), జింక్( Zinc) లోపం ఉన్నా కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. అందువలన క్యాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారికి, నోటి దుర్వాసన, కిడ్నీ ఫెయిల్యూర్, సోరియాసిస్ (Psoriasis), ఎగ్జిమ, న్యూమోనియా (Pneumonia) వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మచ్చలు వస్తాయి. ఆర్సెనిక్ ఫుడ్ పాయిజనింగ్ అయినా ఇలా గోళ్లపై తెల్ల మచ్చలు వస్తాయి. అయితే ఈ మచ్చలు మరీ పెద్దగా, ఎక్కువ సంఖ్య లో ఏర్పడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !