NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: సినిమా టికెట్ల ధర వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చిన ఏపి హైకోర్టు..

AP High Court:రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు టికెట్ల వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ (జేసి) ముందు ఉంచాలనీ, వారే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ థియేటర్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్ జడ్జి విచారణ జరిపి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో పిటిషన్లకు ఊరట లభించినట్లు అయ్యింది.

AP High Court key orders on cinema tickets issue
AP High Court key orders on cinema tickets issue

అయితే సింగిల్ జడ్జి అదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణతో కూడి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. థియేటర్ యజమాన్యాలు ధరలు పెంచి టికెట్లు విక్రయిస్తే సామాన్యులపై భారంపడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మాసనం ..టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమాన్యాలు జేసి ముందు ఉంచాలని ఆదేశించింది. ధరలపై నిర్ణయం జేసియే తీసుకుంటారని పేర్కొంది. టికెట్ ధరలపై ప్రభుత్వం ఒ కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.

AP High Court key orders on cinema tickets issue
AP High Court key orders on cinema tickets issue

సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ తదితర ప్రముఖులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. త్వరలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పెద్ద నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?