NewsOrbit
న్యూస్

Karthika deepam: మోనిత కొడుకుని ఎత్తుకుపోయిన రుద్రాణి… మరి మోనిత రుద్రాణిని ఎలా ఎదురుకోనుంది.. !

Karthika deepam: కార్తీక దీపం సీరియల్ మంచి రసవత్తరంగా సాగుతుంది.అనుకోని ట్విస్ట్ లతో రోజుకో మలుపు తిరుగుతుంది.మోనిత బాబు గురించిన వీడియోను బయటపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని బయటకు పొమ్మంటుంది. ఇది సౌందర్య నిలయం అని గుర్తు పెట్టుకో, ఏదైనా వేషాలు వెయ్యాలంటే గడప బయట వెయ్యి.. నీకు సరైన సమాధానం నేను చెబుతాను.. మరోసారి లోపలకి రావాలని ప్రయత్నించకు అని అంటుంది.అత్తయ్యగారు ఎంతో బాధ్యతగా నా కొడుకుని ఎవరు తీసుకుని వెళ్లారో చూపించారు..నా కొడుకుని, మీ కొడుకుని తీసుకుని త్వరలోనే వస్తాను’ అంటూ అక్కడ నుంచి వెళ్తుంది మోనిత. ఇక శ్రీవల్లి ఇంట్లో బాబుకు నామకరణం చేయడానికి పంతులు పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటాడు.

Guppedentha manasu: వసు విషయంలో ఎక్సట్రాలు చేయొద్దని గౌతమ్ కి వార్నింగ్ ఇచ్చిన ఈగోమాస్టర్..!

బాబును లాక్కుని పోయిన రుద్రాణి :

పూజ మధ్యలో.. ‘అమ్మా బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు’ అంటాడు. ‘ఆనంద్’ అని కోటేష్ చెప్పకముందే ‘రంగరాజు’ అని పేరు చెప్పి లోపలికి ఎంట్రీ ఇస్తూ ‘ఏం శ్రీవల్లీ పేరు బాగుందా?’ అంటూ శ్రీవల్లి చేతుల్లోని బాబుని లాక్కుంటుంది రుద్రాణి.. ‘పంతులుగారు.. ఈ రోజు వీడి నామకరణంతో పాటు, దత్తత కార్యక్రమం కూడా చేస్తాను.. వీడ్ని నేను దత్తత తీసుకుంటున్నాను’ అంటుంది. వెంటనే శ్రీవల్లి ‘వద్దమ్మా’ అంటూ రుద్రాణి కాళ్ల మీద పడిపోతుంది.ఇది అన్యాయం’ అని దీప కోపంగా అంటే, చాలు తగ్గు దీపా.. ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు నువ్వు నీ భర్త అంటుంది.

Guppedentha manasu: వసు విషయంలో ఎక్సట్రాలు చేయొద్దని గౌతమ్ కి వార్నింగ్ ఇచ్చిన ఈగోమాస్టర్..!
ఆవేశంతో ఊగిపోయిన దీప :

ఇంతలో కార్తీక్.. ‘ఇది కరెక్ట్ కాదండి. మీకు సంతకం చేశాను కదా.. డబ్బు ఇస్తాను అని’ అంటాడు కోపంగా..నిజానికి ‘ఒప్పందం ప్రకారం నీ కూతుర్ని తీసుకుని వెళ్లాలి.. మరి ఇప్పడు ఆ పని చెయ్యనా’ అంటుంది రుద్రాణి కార్తీక్ చెవి దగ్గరకు వచ్చి నెమ్మదిగా. దాంతో కార్తీక్ భయంతో వెనకడుగు వేస్తాడు. దీప ఆవేశ పడిపోతుంటే కార్తీక్.. ‘ఆగు దీపా.. నువ్వు ఆగు’ అని ఆపేస్తాడు. ‘రేయ్ ఈ బాబుని తీసుకుని వెళ్లండ్రా’ అంటూ ఒక రౌడీకి ఇచ్చి బాబుని తన ఇంటికి పంపేస్తుంది. అయినా దీప ఆవేశంగా అడుగులు ముందుకు వేయడం చూసి.. రుద్రాణి.. ‘అడుగు ముందుకు పడిందంటే.. నువ్వు నీ పిల్లలు నీ భర్త అన్యాయం అయిపోతారు గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

ఆనందంలో సౌందర్య కుటుంబం :

ఇక సౌందర్య చాలా సంతోషంగా ఉంటుంది మోనిత వెళ్లడంతో.. ‘రేయ్ ఆదిత్య వెళ్లు కిచెన్‌లోకి వెళ్లి మా ముగ్గురికీ ఏదైనా చేసి తీసుకునిరా’ అంటుంది. శ్రావ్య, ఆనందరావు, సౌందర్యలు కాసేపు ఆదిత్యని ఆటపట్టిస్తారు. తర్వాత దీప, కార్తీక్‌లతో పాటు.. మోనిత బాబు గురించి కూడా బాధపడతారు. ఇంకా శ్రీవల్లి బాబు గురించి ఏడుస్తూ ఉంటే దీప ఓదారుస్తుంది.పదండి.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగింది చెబుదాం’ అంటుంది ఆవేశంగా.. వద్దు అని దీప, కోటేష్ ఎంత చెప్పినా వినదు.. దాంతో దీప.. ‘పదండి మనం కూడా శ్రీవల్లికి సాయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం’ అంటుంది.

దీప పోలీస్ స్టేషన్ కు వెళ్లనుందా..?

వెంటనే కార్తీక్ దీప దగ్గరకు వచ్చి.. ‘ఈ పరిస్థితిల్లో మనం స్టేషన్‌కి వెళ్లడం కరెక్ట్ కాదు. ఈ పాటికే మన ఫొటోస్ అన్ని స్టేషన్స్‌కి చేరి ఉంటాయి. ఇబ్బందుల్లో పడిపోతాం దీపా’ అంటాడు.ఈలోపు ‘అక్కా మీరు రావాలని నేనేం అనుకోవట్లేదు.. మీరు ఉండండి..కోటేష్ ను నువ్వు అయిన వస్తావా అయ్యా? లేదా? నువ్వు రాకున్నా నేను వెళ్తాను.. చావైనా బతుకైనా ఆడే తేల్చుకుని వస్తాను’ అంటూ వెళ్తుంది. వెనుకే కోటేష్.. ‘వల్లీ నేను వస్తున్నా ఆగు’ అంటూ పరుగుతీస్తాడు. ఇక మోనిత బస్తీలో వంటలక్క ప్రజావైద్యశాలలో కూర్చుని ఉంటే.. వారణాసి, లక్ష్మణ్‌లు వచ్చి ఎక్కిరించి వెళ్తారు. ఇక కార్తీక్ మాత్రం రుద్రాణి మాటలు గుర్తు చేసుకుని రేపు నా కూతుర్లని కూడా ఆ రుద్రాణి అలానే లాక్కుని పోతుందేమో అని బయపడిపోతాడు.
ఇంతలో దీప వచ్చి.. ఏం ఆలోచిస్తున్నారు అని అనడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N