NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Govt: ప్రభుత్వం కోర్టులో పీఆర్సీ పంచాయతీ..! ఏం తేలేనో..?

ap govt decision on prc

AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సోమవారం రాత్రి పీఆర్సీపై జీవో ఇవ్వగా మంగళవారం దీనిపై ఉద్యోగ సంఘాల చర్చలు, నిరసనలు, ప్రెస్ మీట్లు, తమ కార్యాచరణ గురించి సమావేశాలు జరిగాయి. బుధవారం ఉద్యోగ సంఘాల నిరసన తెలియజేస్తే.. ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గురువారం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనల హోరు, ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ.. ఉద్యోగులు ఆశించిన 27 శాతం కాకుండా ప్రభుత్వం 23 శాతం ప్రకటించడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఈనేపథ్యంలో నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించనుంది.

ap govt decision on prc
ap govt decision on prc

గతంలో కూడా సమ్మెలు..

అయితే.. (AP Govt) ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కు తగ్గుతుందా..? ముందుకే వెళ్తుందా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే.. వారు కూడా ఈ ఉద్యమంలో ఉన్నట్టు.. పీఆర్సీని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకున్న అధికారాలు ఉపయోగిస్తుందా..? ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాబట్టి ఈ విషయంలో పునరాలోచిస్తుందా అని ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఉద్యోగుల సమ్మెపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశంలో హయాంలో కూడా ఇలా ఉద్యోగులు సమ్మెలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులు వైఎస్ హయాంలో ఓసారి, తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఓసారి ఇంతే తీవ్రతతో సమ్మెలకు వెళ్లిన సంగతి తెలిసిందే.

క్యాబినెట్ సమావేశం కీలకం..

అయితే.. వైసీపీ (AP Govt) ప్రభుత్వం ఉద్యోగులతో అంత ఖరాఖండీగా వెళ్తుందని చెప్పలేం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా సంక్షేమానికి, పధకాల అమలుకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా సమయంలో కూడా వెనక్కు తగ్గలేదు. ఇవన్నీ కొనసాగాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరి. ప్రభుత్వానికి ప్రజలెంతో.. ఉద్యోగులూ అంతే. కాబట్టి ఉద్యోగుల డిమాండ్లపై పునరాలోచిస్తుందనే అంటున్నారు. కాబట్టి.. ఉద్యోగులను శాంతింపజేయటానికీ లేదా.. తాము ఆశించింది కాకుండా 27 శాతం ఫిట్ మెంట్ ప్రకటించినా సయోధ్య కుదిరినట్టే. మరి.. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం వస్తుందో చూడాల్సి ఉంది.

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?