Siri: సిరి హన్మంత్.. తెలుగు కుర్రకారుకి బాగా సుపరిచితమైన పేరు. బిగ్ బాస్ షోతో ఈ అమ్మడు తెలుగువాళ్ళకు గిలిగింతలు పెట్టింది. అంత త్వరగా మనవాళ్ళు ఈమెను మర్చిపోరు. షోలో షన్ను తో ఈ ముద్దుగుమ్మ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడేలా వీరు రెచ్చిపోయారు. అయినదానికి, కానిదానికి వీరు హగ్గులు, ముద్దులు అంటూ చెలరేగిపోయి సరిహద్దులు చెరిపేసారు. ఏముంది కట్ చేస్తే దీప్తి షన్ను కి బ్రేకప్ చెప్పేసింది.
Pawan kalyan: ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ డైలమాలో పడ్డాడు..ఆ రెండవ తేదీ ఎందుకంటే..?
Siri: సిరి తల్లి దీన్ని ముందే ఊహించింది.!
సిరి తల్లి అయినటువంటి శ్రీదేవీ సిరిని ఉద్దేశించి అప్పుడే కాస్త హెచ్చరించింది. అమ్మ అంత జాగ్రత్తగా చెప్పినా, సిరికి ఆ విషయాలు ఎంతమాత్రం రుచించలేదు. తన పద్దతి ఏమాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో సిరిని నానా రకాలుగా ట్రోల్ చేసి అవతల పారేసారు జనాలు. అయినా వారికి అవేవీ పట్టలేదు సరికదా.. వారి వారి పర్సనల్ లైఫ్ గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అందుకే నేడు దాని పర్యవసానం ఇద్దరు అనుభవిస్తున్నారు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
AP News: కరోనా వస్తే పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు పరుగు..! ప్రజా ప్రతినిధులు మీరు ఏమి సందేశం ఇస్తున్నారు..!?
సోషల్ మీడియాలో వీరి చేష్టలు…
ఇక ఇంత జరిగినా వీరికి గిల్టీగా ఉండదేమో మరి.. సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తూ జాలిగా గడుపుతున్నారు. షన్ను ఒకవైపు, సిరి ఒకవైపు సోషల్ మీడియాను ఫుల్ గా దున్నేస్తున్నారు. ప్రతిరోజూ ఏవేవో పోస్టులతో, చేష్టలతో తాము ఇంకా ఉన్నామంటూ చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే సిరి తాజాగా ఓ పోస్ట్ చేసింది. అదేమంటే చీరలకు ఆమడ దూరం వుండే సిరి తాజాగా ఓ గ్రీన్ కలర్ శారీలో మెరిసింది. సదరు వీడియోని పోస్ట్ చేసింది. మీరు కూడా తిలకించండి.