NewsOrbit
న్యూస్ సినిమా

F 3: ఎఫ్ 3 రిలీజ్ విషయంలో అతిపెద్ద రూమర్స్..చెక్ పెట్టిన మేకర్స్

F 3: ఇటీవల టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన డేట్స్ అన్నీ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి చిన్న సినిమాల వరకు సమ్మర్ వరకు వరుసగా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నారు. ముందుగా వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా అంటే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్. ఈ సినిమా మార్చి 11వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా 14 భాషలలో మార్చి 25వ తేదీన భారీ స్థాయిలో రిలిజ్ కాబోతోంది. అలా ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట మే 12న రాబోతుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటు హీరోలుగా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25వ తేదీన లేదా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 8వ తేదీ అని మరో తేదీని కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్సైనా కూడా రెండు మూడు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆచార్య, భీమ్లా నాయక్, ఎఫ్ 3 సినిమాల విషయంలో ఈ న్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఎఫ్ 3 మూవీ మీద వస్తున్న రూమర్స్‌కు మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

F 3: రిలీజ్ తేదీతో కూడుకున్న పోస్టర్‌ను వదిలి క్లారిటీ.

విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ హీరోయిన్ మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఎఫ్ 3 సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాను మే 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ దిల్ రాజు బృందం ఇప్పుడు రిలీజ్ తేదీతో కూడుకున్న పోస్టర్‌ను వదిలి క్లారిటీ ఇచ్చారు.

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri