NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: వివేకా హత్య కేసు..బెయిల్ కోసం మరో సారి ప్రయత్నం చేస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి..

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం మరో సారి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లభించలేదు. ఈ కేసులో శివశంకరరెడ్డి పాత్రను సీబీఐ కోర్టుకు వెల్లడించి బెయిల్ మంజూరు చేయవద్దంటూ గతంలో వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్ రెడ్డి మరో సారి కడప కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది.

ys viveka case devireddy sivasankar reddy bail petition
ys viveka case devireddy sivasankar reddy bail petition

Read More: YS Viveka Case: వివేకా హత్య కేసు ..చంద్రబాబు వర్సెస్ సజ్జల

YS Viveka Case: దర్యాప్తు వేగవంతం

మరో పక్క సీబీఐ అధికారులు హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సీీబీఐ డీఐజీ చౌరాసియా కడప సెంట్రల్ జైలు అతిధి గృహంలో మకాం వేసి దర్యాప్తునకు సంబంధించి అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా సీబీఐ అధికారులు వాంగ్మూలం పత్రాలను పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరితో మరో సారి కోర్టులో వాంగ్మూలం నమోదు చేయనున్నారు. వివేకా హత్య కేసులో మూడవ నిందితుడుగా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ మారడానికి కడప సబ్ కోర్టు ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది.

మరోసారి దస్తగిరి నుండి 164 సెక్షన్ కింద వాంగ్మూలం

దస్తగిరి అప్రూవర్ గా మారుతున్నాడనీ, 306 సెక్షన్ కింద సాక్షం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇతర నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కోర్టు సీబీఐ వాదనలతోనే ఏకీభవించి దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు మరోసారి దస్తగిరి నుండి 164 సెక్షన్ కింద మెజిస్ట్రెట్ సమక్షంలో వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N