NewsOrbit
న్యూస్ సినిమా

Project K: అమితాబ్ బచ్చన్ రోల్ రివీల్.. ప్రభాస్‌కి బిగ్ బి తప్ప ఇంకెవరూ సూటవరు..!

Project K: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కె సినిమా ఒకటి. పాన్ వరల్డ్ సినిమాగా సౌత్ భాషలతో పాటు, బాలీవుడ్ హాలీవుడ్‌లోనూ ఈ సినిమానూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసేలా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేయని ఓ కొత్త తరహా పాత్రను ఇందులో ప్రభాస్ పొషిస్తున్నారు. సూపర్ హీరో తరహా పాత్ర చేస్తున్న కారణంగా ఆనంద్ మహీంద్ర సహాయం కావాలని కోరారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ దర్శకు ఇప్పటి వరకు తీసింది కేవలం రెండు సినిమాలే.

amitab bacchan role is revealed in project-k-
amitab bacchan role is revealed in project-k-

వాటిలో మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం చాలా చిన్న సినిమా. ఆ తర్వాత తెరకెక్కించిన సినిమా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారం రూపొందించిన మహానటి. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా టాలీవుడ్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, మహానటి తర్వాత అందరూ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని భావించారు. అందుకు కారణం స్వయంగా చిరు మంచి కథ తయారు చేయి మనం సినిమా చేద్దామని ఆఫర్ ఇవ్వడమే. కాని, నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్‌ను దృష్ఠిలో పెట్టుకొని ప్రాజెక్ట్ కె చిత్రాన్ని ప్రకటించాడు.

Project K: ధనిక వ్యాపార్త వేత్తగా అల్ట్రా స్టైలిష్ పాత్రలో..?

ఇక ఈ సినిమాను దాదాపు రూ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణ సంస్థలో 50 వ సినిమాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అగ్ర నిర్మాత సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ దీపిక పడుకొణ్, బిగ్ అమితాబ్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇన్నాళ్ళు ప్రాజెక్ట్ కె లో అమితాబ్ రోల్ ఏమై ఉంటుందో అని అందరూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా అమితాబ్ కనిపించబోతున్నాడట. భారీ స్థాయిలో ఉండే ధనిక వ్యాపార్త వేత్తగా అల్ట్రా స్టైలిష్ పాత్రలో అలరిచబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్‌కు తండ్రిగా ప్రాజెక్ట్ కెలో అమితాబ్ తప్ప మరొకరు సెట్ కారని మేకర్స్ డిసైడయి ఆయనని ఎంచుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri