NewsOrbit
న్యూస్

Mamata Banerjee: విపక్షాల నేతలకు మమతా బెనర్జీ కీలక లేఖ..మోడీకి వ్యతిరేకంగా మరో అడుగు

Mamata Banerjee: కేంద్రంలోని మోడీ సర్కార్ పై బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చాలా కాలంగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల నాటిక ఎన్డీఏకి ప్రత్యామ్యాయ శక్తిగా ఎదగాలని వ్యూహాలను రచిస్తున్నారు మమతా బెనర్జీ. ఈ క్రమంలోనే పలు మార్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరిపారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ తోనూ గతంలో సమావేశమైయ్యారు. మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా అదే బాటలో బీజేపీయేతర నేతలతో భేటీలు నిర్వహించారు. తొలుత తమిళనాడు సీఎం స్టాలిన్, తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే. ఎన్సీపీ నేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితర నేతలతో సమావేశమైయ్యారు కేసిఆర్.

Mamata Banerjee Letter to opposition CMs
Mamata Banerjee Letter to opposition CMs

Read More: KCR: కేసిఆర్ టార్గెట్ ఫిక్స్..మోడీ సర్కార్ పై సంచలన కామెంట్స్

Mamata Banerjee: దేశ ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఏర్పడే దిశగా

ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీయేతర పార్టీలు అన్నీ ఏకమవ్వాలని మమతా బెనర్జీ లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు సమావేశం అవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోందని, ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగ పోరాడేందుకు ఎన్డీయేతర ప్రతిపక్షశ్ర పార్టీలన్నీ ఏకమవ్వాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యత సాధించాలనీ, దేశ ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు.

ప్రగతిశీల శక్తులు అన్నీ చేతులు కలపాలి

కేంద్ర ప్రభుత్వం దేశంలో అణచివేత ధోరణితో పాలన సాగిస్తోందని, దానిపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులు అన్నీ చేతులు కలపాలని దీదీ అన్నారు. సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై బీజేపీ దాడులు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, సీవీసీ, ఆదాయపన్ను శాఖ వంటి సంస్థలను వాడుకుంటోందని దీదీ ఆరోపణలు గుప్పించారు. బీజేపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేసేందుకే తాను ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాస్తున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju