NewsOrbit
న్యూస్ సినిమా

Alia Bhatt: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా నుంచి ఆలియా డ్రాపయిందా..?

Alia Bhatt: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా నుంచి ఆలియా డ్రాపయిందా..? అంటే ప్రస్తుతం అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటు తారక్‌కు అటు చరణ్‌కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ పాత్రకు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.

is alia-bhatt dropped out from koratala siva and ntr movie
is alia-bhatt dropped out from koratala siva and ntr movie

ఇప్పటి వరకు తారక్ టాలెంట్ గురించి సౌత్ ఆడియన్స్‌కు మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్‌లో కూడా తారక్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ నందమూరి హీరో నుంచి రాబోయే సినిమాల మీదే అందరి దృష్టి పడింది. కాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆలియా కూడా ఈ విషయాన్ని హింట్ ఇచ్చింది.

Alia Bhatt: అఫీషియల్‌గా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు..!

ఇదే నిజమైతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆలియా తెలుగులో నటించే సినిమా ఇదే. అంతే కాదు, ఈ సినిమాలో ఆలియా పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటించినట్టు అవుతుంది కూడా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఎన్టీఆర్ 30 ని ఈ కారణంతోనే ఆలియా ఒప్పుకుందని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాపయిందా అనే రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వల్ల తనకేమీ లాభం చేకూరలేదనే భావనతోనే ఈ మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది అఫీషియల్‌గా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. చూడాలి మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri