RRR: ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళు రాబడుతోంది. ఈ ఊపుతోనే ఈ పాన్ ఇండియన్ సినిమా సక్సెస్ ఫుల్ గా రెండో వారం కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ఊహించని రేంజ్లో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది.
అయితే ఈ వారం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మూవీ ‘ఎటాక్’ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా విడుదలతో తారక్ – చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ళపై గట్టిగానే ప్రభావం చూపుతుందని బాలీవుడ్ వర్గాలు భావించాయి. అయితే, ఎటాక్ మూవీ ఓపెనింగ్ రోజు సీన్ రివర్స్ అయింది. అసలు ఆర్ఆర్ఆర్ సినిమాను టచ్ కూడా చేయని విధంగా అతి తక్కువగా వసూళ్ళు వచ్చాయి.
RRR: చరణ్, తారక్‌ల దెబ్బకి బాలీవుడ్ హీరోకు పంచ్ గట్టిగానే పడింది.
ఈ సినిమా రిలీజ్‌కి ముందు ప్రమోషన్స్‌లో హీరో జాన్ అబ్రహాం ఆర్ఆర్ఆర్ సినిమాను ఉద్దేశించి కాస్త నెగిటివ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్లో సౌత్ సినిమాల హడావిడి ఎక్కువవుతుందని నెగిటివ్‌గా మాట్లాడాడు. కట్ చేస్తే ఇప్పుడు తన సినిమాకే సీన్ లేకుండా పోయింది. మొదటి రోజు 3 కోట్లకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాలేదు. దాంతో ఇప్పుడు మెగా నంద మూరి అభిమానులు జాన్ అబ్రహాం మీద కామెంట్స్‌తో దుమారం రేపుతున్నారు. సౌత్ సినిమానే బాలీవుడ్లో సత్తా చాటుతోందని..మీరు నటించిన సినిమా మీ దగ్గరే చతికిల పడిందని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద చరణ్, తారక్‌ల దెబ్బకి బాలీవుడ్ హీరోకు పంచ్ గట్టిగానే పడింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!