NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: సరిగ్గా నెలరోజులు..బాబుకి ఈసారికి కలిసొచ్చేనా..?

Sarkaru Vaari Paata: ఈ రోజు ఏప్రిల్ 12. ఇప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మోస్ట్ స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రిలీజ్ కాబోతోంది. అంటే ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. మహేశ్ కెరీర్‌లో మొదటిసారి ఇంత లాంగ్ గ్యాప్ వచ్చింది. సరిలేరు నీకెవ్వరు వచ్చిన మూడేళ్ళకు సర్కారు వారి పాట వస్తోంది. వాస్తవంగా అయితే మరో రెండు సినిమాలైనా బాబు నుంచి వచ్చేవి. కానీ, కరోనా కారణంగా కొన్ని నెలలు రిలీజ్ ఆలస్యం అయితే, రాజమౌళి కోసం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడుసార్లు పోస్ట్ పోన్ చేసి ఆలస్యం అయింది.

sarkaru-vaari-paata countdown starts
sarkaru-vaari-paata countdown starts

ఎట్టకేలకు మే 12న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అభిమానులు టెన్షన్ పడుతుంది ఈ సినిమాను మేలో రిలీజ్ చేస్తున్నందుకే. ఇంతక ముందు మహేశ్ బాబు నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి సినిమాలు ఇదే మే నెలలో వచ్చి భారీ డిజాస్టర్స్‌గా మిగిలాయి. ఆ నెగిటివ్ సెంటిమెంట్ సర్కారు వారి పాటకు కూడా మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఓ టాక్ వినిపిస్తోంది. చెప్పాలంటే సర్కారు వారి పాట సినిమా సోలోగానే బాక్సాఫీస్ వద్ద దిగుతోంది. మరో భారీ సినిమా ఏదీ ఇప్పటి వరకు పోటీ లేదనే చెప్పాలి.

Sarkaru Vaari Paata: ఇవన్నీ దాటుకొని బాబు హిట్ కొట్టాడంటే కొత్త హిస్టరీనే..

ఏ మాత్రం కథ, కథనం బావున్నా బాబు బాక్సాఫీస్ వద్ద కుమ్మేయడం ఖాయం. అదే ఇప్పుడు అందరిలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొల్పింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటిస్తుంది. ఆమెకు మహానటి సినిమా తర్వాత మళ్ళీ హిట్ దక్కింది లేదు. ఈ విషయంలో కూడా బాబు డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. మరి ఇవన్నీ దాటుకొని బాబు హిట్ కొట్టాడంటే కొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్టే అనుకోవాలి. ఇక ఒక్క సాంగ్ తప్ప షూటింగ్ మొత్తం పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయింది. వచ్చేవారం నుంచి ప్రమోషన్స్ మొదలవబోతున్నాయి. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri