Samantha – Nayanatara: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న సమంత – నయనతార కలిసి ఇంతవరకు స్క్రిన్ షేర్ చేసుకుంది లేదు. మొదటిసారి ఓ తమిళ మల్టీస్టారర్ సినిమాలో నటించారు. నయనతారకు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మంచి క్రేజ్ ప్రాజెక్ట్..అది కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమా అయితే ఆమెనే మేకర్స్ ముందు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సమంత నటించిన శాకుంతలం రిలీజ్‌కు రెడీ అవుతుండగా యశోద షూటింగ్ దశలో ఉంది. సమ్మర్లో హాలీవుడ్ సినిమా మొదలవబోతోంది. కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ డిస్కర్షన్లో ఉన్నాయి. యాడ్స్ పరంగా సమంత నటించినది వారానికో యాడ్ ప్రసారమవుతోంది. ఇంత బిజీగా ఉన్న సమంత నయనతారతో కలిసి నటించిన ముక్కోణపు ప్రేమ కథ కథువాకుల రెండు కాదల్ అనే మల్టీస్టారర్ సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
Samantha – Nayanatara: ఈ సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మర్గా ఎవరు నిలుస్తారో..?
కణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్‌తో ఈ నెల ఆచార్య సినిమా కంటే ఓ రోజు ముందు అంటే ఏప్రిల్ 28న వస్తోంది. ఇటీవల వచ్చిన ట్రైలర్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాలో నయనతారది పాజిటివ్, సమంతది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. ఇద్దరిదీ పోటా పోటీగా ఉండే పాత్రలని సమాచారం. అంతేకాదు ఎక్కువగా సమంత పాత్రనే హైలెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి నయన్ – సామ్ తమ పాత్రలతో గట్టిగా పోటీ పడి
నటిస్తున్న ఈ సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మర్గా ఎవరు నిలుస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు దర్శకుడు నయనతార భర్త కావడం విశేషం.