NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

JD Lakshmi Narayana: పోటీకి జేడి రెడీ..! కానీ ఒకే ఒక కండీషన్ ..!

JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీబీఐ నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆయనే రాజకీయ పార్టీ పెడతారు అని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరనున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చడంతో అనూహ్యంగా ఆ పార్టీలో చేరారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాతో పాటు వివి లక్ష్మీనారాయణ వ్యక్తిగత ఇమేజ్ కారణంగా రెండున్నర లక్షలకుపైగా ఓటు సాధించారు. ఆయనకు ఎటువంటి మరక లేదు. అయితే ఎన్నికల అనంతరం ఆయన జనసేన పార్టీ కి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు.

JD Lakshmi Narayana: సామాజికవర్గ మీటింగ్ లలో

రాబోయే సార్వత్రిక ఎన్నికలల్లో వివి లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు..? ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు ..? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఆయన సన్నిహితులు కూడా చాలా మంది ఆయనను కలిసిన సందర్భంలో ఎక్కడ నుండి పోటీ చేస్తారు..?  ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అప్పుడప్పుడూ ప్రభుత్వం చేసిన తప్పులను మాత్రం ఎత్తిచూపుతున్నారు. అదీ కొన్ని సందర్భాల్లో, టీవీ డిబేట్ లో మాత్రం. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఖడ్గమేవ జయతే అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే సామాజికవర్గ మీటింగ్ లలో ఆయన పాల్గొంటున్నారు. గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ ఇంకా పలువురు కాపు సంఘం నేతలు హైదరాబాద్ లో నెలకు ఒక సారి రెండు సార్లు సమావేశం అవుతున్నారు. తమ సామాజికవర్గ ప్రయోజనాలు, తమ సామాజికవర్గం ఏ రాజకీయ పార్టీకి పని చేస్తే బాగుంటుంది. తమ సామాజికవర్గం ఏమి చేయాలి..? సామాజికవర్గం మొత్తం మూకుమ్మడిగా ఒక వేదిక నిర్మించుకుంటే బాగుంటుందా..? అనే విషయాలపై చర్చిస్తూ సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఆ ప్రయత్నాలను పక్కన బెట్టి టీడీపీలోనే ఉంటే బాగుంటుందని భావించి నిన్న ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. అయితే గంటా శ్రీనివాసరావు మళ్లీ సామాజికవర్గ మీటింగ్ లలో పాల్గొనే అవకాశం ఉంది. ఆయన రాజకీయం ఎవరికి ఒక పట్టాన అర్ధం కాదు. పార్టీలు మారడం ఆయనకు షర్ట్ విప్పి వేసుకున్నంత ఈజీ.

JD Lakshmi Narayana: ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై ఆసక్తి

అయితే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోవాలంటే.. ఆయన మూడు పార్లమెంట్ స్థానాలపై ఆసక్తిగా ఉన్నారు. తాను పోటీ చేసి ఓడిపోయిన విశాఖపట్నం లోక్ సభ స్థానంతో పాటు కాకినాడ, ఏలూరు పార్లమెంట్ స్థానాలపై ఆయన ఆసక్తిగా ఉన్నారు. తాను ఓడిపోయిన విశాఖపట్నం స్థానం నుండే మళ్లీ పోటీ చేసి గెలవాలన్న భావనతో లక్ష్మీనారాయణ ఉన్నారు. ఒక వేళ కుదరకపోతే కాకినాడ, ఏలూరు లోక్ సభ స్థానాలను సెకండ్, థర్డ్ ప్రయారిటీగా ఉంచుకుని ఈ మూడు నియోజకవర్గాల నుండి అంతర్గతంగా సర్వే రిపోర్టులు తెప్పించుకున్నారు. అయితే విశాఖపట్నం నుండే దృష్టి పెడుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నా.. ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అనేది ఒక ప్రశ్నగా ఉంది. జేడి లక్ష్మీనారాయణ మళ్లీ జనసేన పార్టీలో చేరడానికే ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తొలుత బీజేపీలో చేరాలని ఆసక్తి చూపినప్పటికీ ఆ పార్టీ విధానాలు ఆయనకు నచ్చలేదు. ఒక వేళ బీజేపీలోకి వెళ్లినా ఆ సింబల్ తో పోటీ చేసి గెలవడం కష్టమని ఆయనకు తెలుసు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గడం కష్టమే.

కాకినాడ సెకండ్ ఆప్షన్

ఒక వేళ టీడీపీ – జనసేన పొత్తు ఉంటే విశాఖపట్నం స్థానం నుండి పోటీ చేయడానికి లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నారు. అయితే విశాఖ సీటు నుండి టీడీపీ తరపున బాలకృష్ణ అల్లురు శ్రీభరత్ ఉన్నారు. ఆయనను కాదని లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. కాకినాడ సీటు పొత్తు లో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కాకినాడ నుండి సెకండ్ ఆప్షన్ గా పోటీ చేయడానికి సుముఖతగా ఉన్నట్లు తెలుస్తోంది. తన అంతరంగీకుల వద్ద ఈ విషయం చెప్పినట్లు సమాచారం. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ సినిమాలు మానేస్తాను అని చెప్పి మళ్లీ షూటింగ్ లు చేసుకోవడంతో ఆయనకు రాజకీయంగా నిలకడ లేదని భావించి జనసేన నుండి బయటకు వచ్చారు లక్ష్మీనారాయణ. అయితే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు ఎందుకు తీయాల్సి వస్తుంది అనేది తెలుసుకున్న లక్ష్మీనారాయణ మళ్లీ జనసేనలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవుతున్నారుట.

JD Lakshmi Narayana: టీడీపీ జనసేన పొత్తు ఉంటేనే

అయితే టీడీపీ – జనసేన పొత్తు ఉంటేనే ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారు. జనసేన తరపున పోటీ చేస్తారు. ఒక వేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోతే లక్ష్మీనారాయణ పోటీ విషయంలో కొంత అనుమానించాల్సిన పరిస్థితే ఉంది. టీడీపీ పొత్తు లేకపోతే జనసేన సొంత బలంతో పార్లమెంట్ స్థానాన్ని గెలవడం కష్టమని లక్ష్మీనారాయణకు తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయం. జనసేనకు 15 శాతం బలం ఉందని ఆ పార్టీ వాళ్లే చెబుతున్నారు. విశాఖ, లేదా గోదావరి జిల్లాల్లో 25 శాతం వరకూ ఓటింగ్ వస్తుందని భావించినా ఎంపీ స్థానం గెలవడానికి సరిపోదు. పార్లమెంట్ స్థానం గెలవాలంటే 45 నుండి 50 శాతం ఓటింగ్ సాధించగలగాలి. కేవలం జనసేన తరుపున పోటీ చేసి రెండవ సారి ఓడిపోవడానికి ఆయన సిద్ధం లేరు. టీడీపీ జనసేన పొత్తు ఉంటేనే ఆయన విశాఖ లేదా కాకినాడ నుండి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !