NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape Case: బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుపై కేసు నమోదు

Hyderabad Gang Rape Case: హైదరాబాద్ లో ఇటీవల జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరు సరిగా లేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసి వీడియో, ఫోటో సాక్షాలను మీడియా సమావేశంలో బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేశారని ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘునందనరావుపై కేసు దాఖలైంది. రఘునందనరావుపై ఐపీసీ 228 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Gang Rape Case BJP MLA Raghunandan Rao
Hyderabad Gang Rape Case BJP MLA Raghunandan Rao

Hyderabad Gang Rape Case: ఓ న్యాయవాది ఫిర్యాదుతో

రఘునందనరావు ఇటీవల మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలను మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయనీ, వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందజేస్తానని ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫోటోల్లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని రఘునందనరావు ఆరోపించారు. తొలుత పోలీసులే రఘునందనరావుపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని భావించారనీ, న్యాయనిపుణులను సైతం సంప్రదించారని వార్తలు వచ్చాయి. కానీ ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

Hyderabad Gang Rape Case: అంతకు ముందు జర్నలిస్ట్ పై

ఇదే కేసులో గ్యాంగ్ రేపు బాధితురాలికి సంబంధించి వివరాలను విడుదల చేసిన జర్నలిస్ట్ సుభాన్ పై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే రఘునందనరావు బాధిత బాలిక ఫేస్ ను బయటపెట్టలేదనీ, కేవలం మేజర్ గా ఉన్న ఎమ్మెల్యే కుమారుడు ప్రమేయంపైనే వీడియో విడుదల చేశాననీ, తనకు లభించిన ఆధారాలను బయటపెట్టారని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా తొలుత ఈ కేసులో దర్యాప్తులో ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్ల ల పాత్ర మాత్రమే ఉందని గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు, రఘునందనరావు ఫోటోలు, వీడియోలు బయట పెట్టిన తరువాత ఎమ్మెల్యే కుమారుడిని కేసులో ఏ 6గా చేర్చారు.

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri