NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు..రిటైర్ అయ్యాక ఆయన ఏమి చేస్తారంటే..?

CJI Justice NV Ramana: వివిధ రంగాల్లో ప్రముఖులు తమ పదవీ విరమణ తరువాత వివిధ రకాల కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటుంటారు. కొందరు సమాజ సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తుంటారు. మరి కొందరు విశ్రాంత జీవనం గడుపుతుంటారు. ఉంకొందరు వేరే వేరే వ్యాపకాలు పెట్టుకుంటుంటారు. గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వహించిన గొగొయ్ పదవీ విరమణ తరువాత రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైయ్యారు. అయితే ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపికి చెందిన జస్టిస్ వెంకట రమణ కొద్ది నెలల్లో పదవీ విరమణ అవ్వనున్నారు. ఆయన పదవీ విరమణ తరువాత చేపట్టబోయే కార్యక్రమం టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభిమానులను ఆనందింపజేసేదిగా ఉంది.

CJI Justice NV Ramana Interesting Comments On Nandamuri Taraka Rama Rao
CJI Justice NV Ramana Interesting Comments On Nandamuri Taraka Rama Rao

CJI Justice NV Ramana: ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తా

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్ని జస్టిస్ ఎన్వీ రమణ ..ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై గతంలో ఎన్టీఆర్ మనిషి అన్న ముద్ర వేశారనీ, దానికి తాను గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ .. తాను పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని తెలిపారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. విద్యార్ధి దశలో ఉన్న నాటి నుండి తాను ఎన్టీఆర్ ను అభిమానించేవాడినని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.

ఓ సమగ్ర సమతా మూర్తి

సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ తరపున వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. అయినా ఆయన కేవలం ప్రజాబలంతోనే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. అధికారం కోల్పోయిన తరువాత ఎన్టీఆర్ వెంట ఎవరూ రాలేదనీ, ఆ వైనాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. ఢిల్లీ వెళ్లే సమయంలో ఎన్టీఆర్ తనను తోడుగా తీసుకువెళ్లే వారనీ, ఢిల్లీలో ఆయనకు మందులు కూడా తాను అందించానని తెలిపారు. ఎన్టీఆర్ ను ఓ సమగ్ర సమతా మూర్తిగా అభివర్ణించారు జస్టిస్ ఎన్వీ రమణ.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N