Breaking: తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో బుధవారం నుండి టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. వేతనాలు పెంచే వరకూ షూటింగ్ లకు వెళ్లమని కార్మికులు తేల్చి చెప్పారు. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ 24 క్రాఫ్ట్ సిబ్బంది బుధవారం (22వ తేదీ) ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినీ నిర్మాణ సంస్థలు హీరోలకు భారీగా రెమ్యునరేషన్లు ఇస్తూ, భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా సినీ కార్మికుల వేతనాలను మాత్రం పెరగలేదు. వేతనాలు పెంచాలంటూ గత కొంత కాలంగా కార్మికులు నిర్మాతల మండలిపై ఒత్తిడి తెస్తున్నా స్పందన లేకపోవడంతో సమ్మెకి దిగాలని నిర్ణయించుకున్నారు. బుధవారం నుండి సమ్మె చేస్తున్నట్లు 24 క్రాఫ్ట్ నేతలు తెలిపారు. సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతల మండలి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.