NewsOrbit
5th ఎస్టేట్ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Venkaiah Naidu: ఉప రాష్ట్రపతిగా కొత్త పేరు.. ఉప్పుడే గేమ్ స్టార్ట్ చేసిన వైసీపీ..!

Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ప్రఖ్యాతి గాంచిన నాయకుడు వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు వరుసగా రెండవ సారి ఉప రాష్ట్రపతి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కొంత మంది అయితే ఆయనకు రాష్ట్రపతి పదవి వరిస్తుందని భావించారు. బీజేపీలో సీనియర్ నేత, చాలా కాలం క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగానూ పని చేశారు. పై స్థాయిలో పరిచయాలు ఉండటం వల్ల ఆయనకు రాష్ట్రపతి పదవి వరిస్తుందని భావించారు. ఓ వర్గం మీడియా కూడా ఆయనకు రాష్ట్రపతి పదవి వరిస్తుంది అన్నట్లుగా కూడా ఫోకస్ చేసింది. అయితే న్యూస్ ఆర్బిట్ ముందుగానే వెల్లడించింది. వెంకయ్యనాయుడికి అవకాశం లేదు. ఎస్టీ మహిళ లేదా ముస్లిం మైనార్టీ నేతకు రాష్ట్రపతి అవకాశం ఇవ్వబోతున్నారు అని న్యూస్ ఆర్బిట్ కథనం ఇవ్వడం జరిగింది.

Venkaiah Naidu vice president election bjp news plan
Venkaiah Naidu vice president election bjp news plan

 

అయితే ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడిని మరో సారి కొనసాగిస్తారు అని వార్తలు షికారు చేస్తున్నాయి. బీజేపీ నుండి వస్తున్న సమాచారం ఏమిటంటే వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతిగా కూడా మరో సారి అవకాశం కల్పించడం లేదు. ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఉన్న ఎండీ ఆరీఫ్ ఖాన్ కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అధికారికంగా బీజేపీ ఇప్పటి వరకూవెల్లడించకపోయినా దాదాపు ఆరీఫ్ ఖాన్ పేరును ఉప రాష్ట్రపతికి ఖరారు చేసినట్లు సమాచారం. దీని వెనుక బీజేపీకి ఒక స్ట్రాటజీ, ప్లాన్ ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా ఎస్సీ వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ కు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఎస్టీ మహిళ కు బీజేపీ అవకాశం ఇచ్చింది. గతంలో వెంకయ్య నాయుడికి ప్రత్యేక అవసరాల నిమిత్తం ఉప రాష్ట్రపతి అవకాశం ఇచ్చారు.

 

ఇప్పుడు ముస్లిం మైనార్టీకి చెందిన నాయకుడికి ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం వల్ల బీజేపీ చాలా ప్రయోజనాలు ఆశిస్తొంది. దేశంలో బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అన్న భావనను తుడిచి వేయడానికి గానూ ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించాలని భావిస్తొంది. అదే విధంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. మరో పక్క అరబిక్ దేశాలతో భారతదేశ సంబంధాలపైనా ఆ ప్రభావం పడింది. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు అని చెప్పుకోవడంతో పాటు ఈ వివాదాలను బయటపడేందుకు పార్టీ వ్యాహాత్మకంగా ఈ చర్యలు తీసుకుంటోంది. ఏపీలో వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం పాటించామని చెబుతోంది. అదే మాదిరిగా కేంద్రంలోని బీజేపీ కూడా ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించామని చెప్పుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఆరీఫ్ ఖాన్ కు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారు అన్న విషయం తెలుసుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముందుగానే ఆయనను కలిసి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు కూడా తెలియజేసి వచ్చారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju