NewsOrbit
న్యూస్ సినిమా

అబ్బో, సమంత చాలా బాలీవుడ్ సినిమాలనే లైన్‌లో పెట్టిందిగా..!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ రోల్ చేశాక ఆమెకు బాలీవుడ్‌లో చాలా అవకాశాలకు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాలో ‘ఊ అంటావా’ అనే ఐటమ్ సాంగ్‌తో బాలీవుడ్ కుర్ర ఫ్యాన్స్‌ హృదయాలను కొల్లగొట్టింది. ఈ సాంగ్‌తో ఆమె హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ విధంగా బాలీవుడ్‌కి బాగా పరిచయస్థురాలు కావడంతో అక్కడి హీరోలు, దర్శకులు ఈమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ ముద్దుగుమ్మ ఒకేసారి చాలా బాలీవుడ్ సినిమాలను లైన్‌లో పెట్టగలిగిందని తెలుస్తోంది.

 చాలా సినిమాలనే లైన్‌లో పెట్టిన తార


ఆయుష్మాన్ ఖురానా మూవీతో సమంత బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనుందని ఇప్పటికే బాలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే తాజాగా ఈ అందాల తార బాలీవుడ్ దిగ్గజ హీరో అక్షయ్ కుమార్‌తో ఆన్-స్క్రీన్ రొమాన్స్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అలానే యూరి మూవీ ఫేమ్ విక్కీ కౌశల్ సరసన ఒక భారీ బడ్జెట్ మూవీలో నటించబోతుందనే టాక్ నడుస్తోంది. సాధారణంగా సౌత్ యాక్ట్రెస్‌లు బాలీవుడ్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేయడం చాలా తక్కువ. అయితే సమంత ఒక సౌత్ స్టార్ అయి ఉండి… కుర్ర హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతో కూడా జత కడుతూ తనకున్న క్రేజ్ ఏంటో నిరూపిస్తోంది.

మరింత సమాచారం

విక్కీ కౌశల్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ మూవీలో సామ్ నటించనుందని సమాచారం. ఆదిత్య ధర్ విక్కీ సరసన హీరోయిన్‌గా సమంతని అనుకుంటున్నాడని.. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నాడని ఇన్‌సైడ్ టాక్. విక్కీ ప్రస్తుతం ‘సామ్ బహదుర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. 6-8 నెలలవరకు ఈ సినిమా కోసం తన సమయాన్ని కేటాయిస్తాడు. ఆ తరువాత ఇంకో సినిమా చేస్తాడు. ఆపై ఆదిత్య ధర్ మూవీ షూటింగ్ ప్రారంభించొచ్చు. కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న ఓ మూవీలో అక్షయ్ కుమార్ సరసన సమంత యాక్ట్ చేయవచ్చు. అలానే తాప్సీ పన్ను నిర్మించే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా సామ్ నటించనుంది. ఈ విధంగా చూసుకుంటే సమంత నాలుగైదు బాలీవుడ్ సినిమాలలో నటించబోతుందన్నమాట. ఇక తెలుగులో యశోద, ఖుషి సినిమాలు కూడా ఆమె ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !