NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి .. 12.10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద నీటితో పొటెత్తుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు మరి కొద్ది సేపటిలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో బ్యారేజీ వద్ద 175 గేట్లు ను ఎత్తి 12.10 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి విడుదల చేశారు.

 

వరద నీరు పెద్ద ఎత్తున సముద్రంలోకి వదులుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులు అంచనా వేస్తూ సూచనలు జారీ చేస్తున్నారు. మరో పక్క ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా 200 బోట్లను సిద్ధం చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర భద్రాలయం వద్ద నీటి మట్టం 53.4 అడుగులకు పెరిగింది. అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలోని రామలయ మాట వీధులు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆ ప్రాంతంలోని సుమారు 600 మందిని పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. తెలంగాణలో సీఎం కేసిఆర్, ఏపిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వరదలపై అధికార యంత్రాంగంతో సమీక్షలు జరిపి తగు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు.

ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి.. తలుపులు, కిటికీలు ధ్వంసం

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju